నీవు అనుకుంటే అవుద్ది సామీ……
నీవు బరిలో దిగినప్పుడు, నీవు బరిలో ఉన్నప్పుడు 16 ఏళ్ళపాటు అభిమానులు అనుకున్న మాట ఇది..
నిజ్జంగానే నీవు అనుకుంటే అవుద్ది సామీ..
అందుకేగా… భారత్ ఇన్ని కప్పులు కొట్టింది….
అందుకేగా.. భారత్ ఇన్ని రికార్డులు కొల్లగొట్టింది..
అందుకేగా.. భారత్ విజయాలను అలవాటుగా చేసుకుంది..
అందుకే నీవు నిజంగా భారత క్రికెట్‌కు నిజమైన మహిమల సామివి….
ఇంతటి గెలుపు కిక్కును అలవాటు చేసిన నీవు ఆగస్టు 15న గుడ్ బై చెప్తావని మాత్రం ఎవరూ అనుకోలేదు..
నీ రికార్డుల గురించి అందరికీ తెలుసు.. కానీ నీవేమిటో తనకు తెలుసని కోహ్లీ చెప్పాడు చూడు.. బరిలో నీతో కలిసి సింగిల్స్‌ను డబుల్స్‌గా మలచిన నీ సహచరుడు రైనా వీడ్కోలులోనూ నీ వెంటే ఉన్నాడు చూడు.. ఎక్కడో ఉన్న బ్రావోలాంటి ఆటగాడు నిన్ను బిగ్ బ్రదర్ అన్నాడు చూడు.. అదే నీ క్యారెక్టర్.. నీవు ఒకరికి నాయకుడివి.. ఇంకొకరికి బ్రదర్‌వి. మరికొందరికి మెంటర్వి.. ఇంకా కోట్లాది మంది గుండె చప్పుడివి..
సైన్స్‌లో జన్యు సిద్ధాంతం అని ఉంటుందికదా.. అలాగే క్రికెట్లో నీదో టైపు సిద్దాంతం….
లేకపోతే భారత క్రికెట్లో సో కాల్డ్ దేవుళ్ళు కూడా సాధించలేని ప్రపంచ కప్పులనుసాధించిపెట్టి వారి చేతుల్లో పెట్టడం ఏమిటి.. కూల్‌గా, కామ్‌గా పక్కకు తప్పుకోవడం ఏమిటి..
శవాలతో సెల్ఫీలు దిగే ఈ రోజుల్లో ఎన్ని కప్పులను కొట్టినా సహచరులకు ఇచ్చేసి నీవు పక్కకు తప్పుకుంటూ వారి ఆనందాన్ని ఎంజాయ్ చేశావ్ చూడు.. నీవు కర్మయోగి కాక మరేమిటి..
కైపెక్కించే క్రికెట్లో చాలా మంది పక్కదారి పట్టినా… నీవు మాత్రం హీరోగానే నిలిచావ్..
అవమానం ఎదురైన ప్రతిసారి అంతే బలంగా ఎగసిపడ్డావ్.. కోట్లాది హృదయాలను ఉత్తేజపర్చావ్..
ఇన్నేళ్ళూ నీవు మోసింది వికెట్ల వెనుక భారం కాదు.. నీవు కాపలా కాసింది వికెట్లకే కాదు.. కోట్లాది హృదయాల గుండె చప్పుళ్ళకు… స్వప్నాలకు…
ఇక గ్రౌండ్లో నీ నీడను చూసి ఎవరూ భయపడక్కర్లేదు..
విశాఖ సాగర తీరంలో మొదలెట్టిన నీ కెరీర్‌ను చెన్నై తీరంలో ముగించేశావ్..వెళ్తూ వెళ్తూ ..పల్‌దో పల్ మేరీ కహానీ హై అన్నావ్.. కానీ నీవు చెప్పింది నిజం కాదు.. నీవు అందరిలాంటివాడివి కాదు..
ఎందుకంటే నీవో డైమండ్వి.. అంతకంటే మించి సెవెన్త్ వండర్వి..
లగే రహో….జీతే రహో…
Courtesy:Naga Raju