గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు మహిళల పై సాముహిక అత్యాచారాన్ని మరవకముందే భాగ్యనగరంలో మరో యువతి పైన లైంగిక దాడి జరిగింది. ఈ దారుణ ఘటన పహాడి షరీఫ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్న యువతి(20) విధులు ముగించుకొని సంతోష్ నగర్లో ఆటో ఎక్కింది.
పహాడీ షరీఫ్ తీసుకువెళ్లిన తరువాత ఆటో డ్రైవర్ మరో యువకుడిని ఆటోలో ఎక్కించుకున్నాడు. అనంతరం ఆటోని మరోవైపు మళ్ళించాడు డ్రైవర్.. బాధితురాలు అరవకుండా ఆమె నోరును కుక్కేశాడు ఆ యువకుడు .. అనంతరం బాధితురాలను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ లైంగిక దాడికి పాల్పడ్డారు.
ఆపై యువతిని అక్కడే వదిలేసి నిందితులు పరారయ్యారు. తర్వాత బాధితురాలు నేరుగా సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఆటో డ్రైవర్ల అఘాయిత్యంపై ఫిర్యాదు చేసింది. బాధితురాలు చెప్పిన వివరాల ఆధారంగా కేసును దర్యాప్తు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఆటో ఎక్కిన ప్రాంతం నుంచి దిగిన ప్రాంతం వరకు ఆధారాల సేకరిస్తున్నారు. మార్గ మధ్యలో సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్నారు.
Also Read :
- పడిపోయిన తెలుగు రాష్ట్రాల సీఎంల గ్రాఫ్.. దిగజారిపోయిన మోదీ పాపులారిటీ..!
- Sravanthi : పాపం.. హాట్ బ్యూటీ స్రవంతికి ఏమైంది..?
- Indian embossy in Kabul: తాలిబన్లకు షాక్.. మనోళ్లను తీసుకొచ్చారు.. గ్రేట్ IAF.
- మీ బతుకుల మన్ను.. గాంధీ ఆసుపత్రిలో రెచ్చిపోయిన కామాంధులు..!