Gadwal Bidda : గద్వాల్‌ పిలగాడు ఇక లేడు… ఆస్తమాతో కన్నుమూత..!
Latest Off Beat

Gadwal Bidda : గద్వాల్‌ పిలగాడు ఇక లేడు… ఆస్తమాతో కన్నుమూత..!

Gadwal Bidda : ఇప్పుడు సోషల్ మీడియాలో సెలబ్రిటీ కావడం పెద్ద విషయం కాదు.. ఒక్క వీడియో వైరల్ అయితే చాలు నెటిజన్లు ఆటోమేటిక్ గా సోషల్ మీడియాలో స్టార్ ని చేస్తారు.. అలా ఇప్పటివరకు స్టార్స్ అయినవాళ్ళు చాలానే మందే ఉన్నారు.  అలాగే నువ్వెనివో నాకు తెల్వదు అంటూ సోషల్ మీడియాలో చాలా మందికి పరిచయమైన గద్వాల్‌ పిలగాడు(Gadwal Bidda) మల్లికార్జున్‌ రెడ్డి ఇక లేడు.. ఆస్తమాతో అతను మృతిచెందినట్లుగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

సౌత్‌ ఇండియన్‌ థగ్స్‌ అనే పేజీ మల్లికార్జున్‌ రెడ్డి మృతి చెందినట్లుగా వెల్లడించింది. అతని మృతిపట్ల చాలా మంది సంతాపం తెలుపుతున్నారు. ‘నువ్ ఎవనివో నాకు తెల్వదు… మా జోలికొస్తే ఖబర్దార్ బిడ్డా… నేను గద్వాల రెడ్డి బిడ్డ..’ అంటూ ఓ వీడియోతో ఫుల్ పాపులర్ అయ్యాడు మల్లికార్జున్‌ రెడ్డి.

ఆ తర్వాత దళితుల పై చేసిన ఓ వీడియో వివాదాస్పదం అవ్వడంతో క్షమాపనులు చెప్పాడు. ఇటీవల రామ్‌ గోపాల్‌ వర్మపై కూడా ఓ వీడియో చేయగా అది కాస్త వైరల్ అయింది. అమాయకమైన ఫేస్ తో కనిపించే మల్లికార్జున్ రెడ్డి మీమ్స్ నిత్యం సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక అతని స్వగ్రామమైన జోగులాంబా గద్వాల్ జిల్లాలోని వడ్డేపల్లి మండలం జిల్లేడుదిన్నెలో ఈ రోజు(సోమవారం) అంత్యక్రియలు జరగనున్నాయి.

Also Read :