‘బుల్లెట్టు బండి’ పాపకి బంపర్ ఆఫర్..!
Latest Off Beat

‘బుల్లెట్టు బండి’ పాపకి బంపర్ ఆఫర్..!

తెలంగాణ జానపద గేయం బుల్లెట్టు బండి పాటకి డాన్స్ చేసి ఓవర్ నైట్ సెలబ్రిటీగా మారిపోయింది మంచిర్యాలకి చెందిన నవవధువు సాయిశ్రియ. తన పెళ్లి బరాత్ లో చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది.

మీడియా కూడా వీరిని ఇంటర్వ్యూ చేయడంతో ఆమెకి ఎక్కడలేని పాపులారిటీని తీసుకొచ్చింది. అయితే ఇప్పుడామెకి బంపర్ ఆఫర్ వచ్చింది. ఆమె ఏ పాటకైతే డాన్స్ చేసి పాపులర్ అయిందో ఆ పాటని నిర్మించిన నిర్మాణ సంస్థ బ్లూ రాబిట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ తాము నిర్మించబోయే మరో పాటలో డాన్స్ చేసే అవకాశాన్ని కల్పించింది.

ఈ 'బుల్లెట్టు బండి' పాప ఎవరో తెలుసా? | Batukamma.com | Telugu Breaking News

ఈ విషయాన్ని ఆ సంస్థ నిర్వాకులు వెల్లడించారు. అవకాశం రావడంతో సాయిశ్రియ కూడా ఎగిరి గంతేస్తుంది. త్వరలోనే ఈ కొత్త పాటలో సాయిశ్రియ కనిపించనుంది. ఇదిలావుండగా సాయిశ్రియ  ప్రస్తుతం విప్రోలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా చేస్తుంది.

ఆమె భర్త అశోక్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. మంచిర్యాలకి చెందిన సాయిశ్రియకి.. ఆకుల అశోక్ తో ఈ నెల 14న వివాహం జరిగింది.

కాగా ఈ బుల్లెట్టు బండి పాటను లక్ష్మణ్‌ రాయగా ఎస్‌కే బాజి సంగీతం అందించారు. సింగర్ మోహన భోగరాజు పాడారు. ఈ పాటను బ్లూ రాబిట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మించింది.

Also Read :