Anchor Roja : ఉత్తమ మహిళా జర్నలిస్ట్ అవార్డు అందుకున్నారు టీవీ న్యూస్ ప్రజెంటర్ రోజా(Anchor Roja).. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిన్న హైదరాబాద్ లో తెలంగాణ సమాచార ప్రసార శాఖ ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమానికి మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా యాంకర్ రోజాను ఉత్తమ జర్నలిస్ట్ అవార్డుతో సత్కరించారు. ఈ అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా ఉందని రోజా పేర్కొన్నారు. కాగా టీవీ న్యూస్ ప్రజెంటర్ రోజా అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
Also Read :