TV9 Nagavalli: TV9 కి చెందిన ప్రఖ్యాత యాంకర్ దేవి నాగవల్లి (TV 9 Nagavalli) గారు వర్షాన్ని రుధిరంతో పోల్చారని ఆమెను కించపరుస్తూ సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు.వీళ్ళెవరికీ మన హిందూ ధార్మిక సంస్కృతి తెలియకపోవడం విచారకరం.
మన హిందూ పురాణాలలో శివున్ని రుద్రుడు అంటారు.. ఇతన్నే ప్రళయకార రుద్రుడని కూడా అంటారు.ఇక ఈ రుద్రుడి నుండి కోపంతోనో , ఆవేశంతోనో జాలువారేదే రుధిరం..రుధిరం అంటే మరిగే నెత్తురు , ఆవేశం ,కోపం ఇలా నానార్థాలు చెప్పుకోవచ్చు. ఇక ప్రళయం అంటే కోపం, నాశనం, వర్షం, తుఫాను, నిప్పు లాంటి వాటి వలన కలిగే విధ్వంసం.
ఇక శివుడి నెత్తిన గంగ ఉంటుంది.ఈ గంగ స్వర్గం నుండి భగరథుడి వలన భూమి మీదకు జాలువారుతున్నప్పుడు అత్యంత వేగంతో, పరవశంతో ఉరకలెత్తుతుంటుంది.దీన్నే గంగవెర్రులెత్తడం అని చమత్కార కవులంటుంటారు.
ఇక ఈ వేగంతో డైరెక్ట్ గా గంగ భూమిని తాకితే భూమి భస్మీపటలమౌతుంది.కనుక గంగ ఆ ప్రళయ వేగాన్ని శివుడి జటాజూఠంలోకి మలుపుకుని తర్వాత భూమి మీదకు ప్రవహిస్తుంది.
ఇలా రుద్రుడి నెత్తి మీద నుండి అత్యంత వేగంతో కిందకు జారే గంగే రుధిరం అని రుద్రాగ్ని అని మన హిందువుల పవిత్ర గ్రంథమైన కల్హణుడు రచించిన రాజతరంగిణి గ్రంథంలో చెప్పబడింది.అయితే ఇదే పదాన్ని పురుషసూక్తంలో రుద్రారం గా వాడతారు. దీనర్థం శివుని జటాజూఠం నుండి జారిన చినుకు అనీ.పెద్ద వర్షాలకు ఈ పదం వాడడం ఇప్పట్లో దాదాపు తగ్గిపోయింది.కవులు ఈ పదం మర్చిపోయి రుధిరం అంటే కేవలం రక్తం అనే పదం దగ్గరే ఆగిపోయారు.
కావున మన హిందూ ఆడపిల్లకున్న అపారమైన ఙ్ఞానాన్ని హేళన చేయకుండా ఆమెకు హిందూ బంధువులం అందరం అండగా నిలుద్దాం. పాశ్చాత్యులకు ఎప్పుడూ మన హిందూ పదాలన్నా సంస్కృతి అన్నా హేళన చేయడం అలవాటేగా..
Credit: Krishna Korivi
Also Read :
- New Prime Minister : ప్రధానమంత్రి ఓ ఉగ్రవాది..!?
- Bigg BossTelugu 5 : కొట్లాట మోపైంది.. ఏడ్చేసిన జెస్సీ.. బిగ్బాస్ ఆట షురూ..!
- Eatela rajender : రందిపడకు రాజేందరన్న… మల్ల కోళ్ల ఫారమే దిక్కైతదా అన్న..!
- Bigg Boss 5 Telugu : ‘రవివర్మ గీచిన బొమ్మలా’.. నాగ్ నే ప్లాట్ చేసేసింది..!
- అయ్యా జగన్.. వినాయకచవితి వేడుకల పై ఎందుకీ వివక్ష?