ఏ.. పో అన్న నువ్వు.. ‘బండ్ల’ని మళ్ళీ కాటేస్తున్న ‘ఐడ్రీమ్’ నాగరాజా..!
Cinema Latest Off Beat

ఏ.. పో అన్న నువ్వు.. ‘బండ్ల’ని మళ్ళీ కాటేస్తున్న ‘ఐడ్రీమ్’ నాగరాజా..!

కమెడియన్‌‌గా సక్సెస్ కాకోపోయిన ప్రొడ్యూసర్‌‌గా ఫుల్ సక్సెస్ అయ్యారు బండ్ల గణేష్.. అంతకుమించి ఇంటర్వ్యూలు, ఆడియో ఫంక్షన్ లలో స్పీచ్ లతో ఫుల్ పాపులర్ అయ్యారు. ఇప్పుడు బండ్ల గణేష్ అంటే ఓ పేరు మాత్రమే కాదు ఓ బ్రాండ్ కూడా. ఆ మధ్య పొలిటికల్ ఇంటర్వ్యూలో ఆయన ఇచ్చిన స్పీచ్‌‌లు అయితే ఫుల్ ఫేమస్ అయ్యాయి.

టీవీ5 మూర్తి నుంచి ‘ఐడ్రీమ్’ నాగరాజు వరకు ఇంటర్వ్యూలలో బండ్ల మాటలు తూటాల్లా పేలాయి. ఇక ఇందులో ‘ఐడ్రీమ్’ నాగరాజుకి బండ్ల ఇచ్చిన ఇంటర్వ్యూ ఆడియన్స్‌‌కి మంచి కిక్కిచ్చింది. రిపీట్‌‌గా మరి చూసేశారు ఈ ఇంటర్వ్యూని.. మరికొందరు అయితే కామెడీ లేదా మైండ్ రీలక్స్ కోసం ఈ ఒక్క ఇంటర్వ్యూ చాలు అన్నట్టుగా కామెంట్స్ వదిలారు.

బహుశా ‘ఐడ్రీమ్’ కి ఈ ఇంటర్వ్యూకి వచ్చినన్ని వ్యూస్ మరే వీడియోకి రాలేదేమో.. ఈ ఇంటర్వ్యూలో నాగరాజు తన ప్రశ్నలతో బండ్లను తికమక పెట్టేశారు. ముఖ్యంగా ‘ఏ.. పో అన్న నువ్వు’ అనే బండ్ల డైలాగ్ ఫుల్ ఫేమస్ అయిపొయింది. ఈ ఇంటర్వూ ఎందుకు ఇచ్చానురా బాబు అని ఇంటర్వ్యూలోనే ఫుల్ ఫ్రస్టేషన్‌‌గా ఫీల్ అయ్యారు బండ్ల. ఇక జన్మలో మళ్ళీ నాగరాజుకి ఇంటర్వ్యూ ఇవ్వడు అనుకున్నారంతా.

కానీ ‘ఐడ్రీమ్’ నాగరాజుకి 600 ఇంటర్వ్యూకి బండ్ల గణేష్ కమిట్మెంట్ ఇచ్చారు. దీనికి సంబంధించిన రెండు ప్రోమోలని కూడా యూట్యూబ్‌‌లో రిలీజ్ చేశారు. మళ్ళీ అదే ప్రశ్నలతో బండ్లని కాటేసేందుకు ట్రై చేశాడు నాగరాజు.

Also Read : 

599 ఇంటర్వ్యూ ఒక లెక్క 600 ఇంటర్వ్యూ ఒక లెక్క వెయిటింగ్ అంటూ నెటిజన్లు కూడా ఈ ఇంటర్వ్యూ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫుల్ ఇంటర్వ్యూ రేపు(27-08-2021) అప్లోడ్ అవ్వనుంది.