Zoo Park : జూపార్క్‌లో యువకుడు హల్‌చల్‌…  సింహం దగ్గరికి వెళ్లి..!
Latest Off Beat

Zoo Park : జూపార్క్‌లో యువకుడు హల్‌చల్‌… సింహం దగ్గరికి వెళ్లి..!

Zoo Park : సింహాన్ని దగ్గరినుండి చూడాలంటేనే మాములుగా భయం ఉండదు.. అలాంటిది సింహం నొట్లో తలపెట్టే సాహసం చేశాడు ఓ వ్యక్తి.. అదృష్టం బాగుండి బతికి బయటపడ్డాడు. హైదరాబాద్ జవహర్‌లాల్ నెహ్రూ జూపార్క్‌ (Zoo Park )లో ఓ యువకుడు సింహం ఎన్‌క్లోజర్‌ దగ్గరవరకు వెళ్లాడు.

అక్కడ సింహాన్ని రెచ్చగొట్టాడు.. సింహం కూడా ఎగిరి గాండ్రించింది. ఇదంతా చూస్తున్న జనం ఏం జరుగుతుందో అని గజగజ వణికిపోయారు. వెనక్కి వచ్చేయ్ అని కేకలు పెట్టారు.. అయనప్పటికీ వినకుండా దానిముందే బండరాయిపై కూర్చున్నాడు.

చివరి నిమిషంలో జూ పార్క్ అధికారులు అప్రమత్తం అయి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులకి అప్పగించారు.

దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతని పేరు సాయికుమార్‌ అని అతనికి మతి స్థిమితం లేదని గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read :