Latest Off Beat

నిద్రపోతున్న భర్త పురుషాంగంపై వేడి నీళ్లు పోసిన మూడో భార్య.. చావు కేకలతో ఆసుపత్రిలో..!

నిద్రపోతున్న తన భర్త పురుషాంగంపై సలసల మరిగే నీటిని పోసింది ఓ భార్య.. దీనితో ఆ వేడిని తట్టుకోలేక చావుకేకలు పెట్టిన భర్తను కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తరలించారు.. ప్రస్తుతం అతని ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

వివరాల్లోకి వెళితే..ఏలూరు నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మాచర్ల నాగేంద్రరావు టైలరింగ్ చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య పద్మావతితో పాటుగా ఒక కుమారుడు ఒక కుమార్తె ఉంది. అయితే తరచుగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఇద్దరి మధ్య కూడా గొడవ జరిగింది. శనివారం ఉదయం భర్త నిద్రిస్తున్న సమయంలో సలసలా మరిగే వేడినీటిని అతని పురుషాంగం పై పోసేసింది. దీనితో ఆ వేడిని తట్టుకోలేక చావు కేకలు పెట్టాడు నాగేంద్ర రావు.

వెంటనే అతన్ని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు. దీనిపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పద్మావతిని అదుపులోకి తీసుకున్నారు. పద్మావతి.. నాగేంద్ర రావుకి మూడో భార్య..