Lays : లెస్ అనేవి అందరికీ ఇష్టం ఉండే ఐటెం.. ఫుడ్లో నంజుకునే తినడానికి చాలా మంది ఇష్టపడుతారు.. టైంపాస్ కి తినేవాళ్ళు కూడా ఉన్నారు. పైకి చూడడానికి చాలా పెద్దగా కనిపించే ఈ ప్యాకెట్(Lays )లో కొన్ని మాత్రమే ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన ముచ్చటే.. కానీ ఓ వినియోగదారుడికి ఊహించిన షాక్ ఎదురైంది.
ఆయిదు రూపాయలు పెట్టి కొన్న ఓ లెస్ ప్యాకట్లో ఆరు లెస్ మాత్రమే వచ్చాయి. దీనితో అతను షాక్ గురయ్యాడు. దీనికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన బాధను చెప్పుకున్నాడు.
అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆ లెస్ ప్యాకెట్ పైన 40% ఎక్కువ చిప్స్ అని రాసి ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
When @BYJUS kids joins twitter 🙂 pic.twitter.com/WBkbSxtTNK
— 𝕾𝖆𝖒 (@samsarcastix) November 23, 2021