అబ్బాయిలకు అదే ధ్యాస..?

మిల్కీ బ్యూటీ తమన్నా కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టించేందుకు మళ్లీ వచ్చేసింది.  ‘నెక్స్ట్ ఏంటి?’ అంటూ రొమాంటిక్ డైలాగులతో రెచ్చగొడుతోంది. తమన్నా, సందీప్ కిషన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న రొమాంటిక్ ప్రేమ కథా చిత్రం ‘నెక్స్ట్ ఏంటి?’ టీజర్‌ రిలీజైంది. త్వరలో ట్రైలర్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. పక్కా రోమాంటిక్ కథతో దీన్ని తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ కునాల్ కోహ్లీ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ.. టాలీవుడ్ లో బాలీవుడ్ ఫ్లేవర్ ని చూపించడం ఖాయం అంటున్నారు.

నవదీప్ – తమన్నాల మధ్య ఆసక్తికరమైన చర్చతో టీజర్ కాస్త బోల్డ్ గానే ఉంది. అసలు మీ అబ్బాయిలు ఏం ఆలోచిస్తారు? అని తమన్నా అడిగితే.. నీకు తెలియదా? అని నవదీప్ చెప్పడం.. వెంటనే అబ్బాయిలు అమ్మాయిల్లో కోరుకునే ప్లేబాయ్ విన్యాసాలు కనిపిస్తాయి.

 ‘లైఫ్ చాలా చిన్నదిరా.. మళ్లీ మళ్లీ అవకాశాలు రావు, అందులోనూ అమ్మాయిల విషయాల్లో అస్సలు రావు’ అంటూ సందీప్ కిషన్ చెప్పే డైలాగులు యూత్ బాగా ఓన్ చేసుకుంటున్నారు.