YSRTP : షర్మిలకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన కీలక నేత..!
Latest News Telangana

YSRTP : షర్మిలకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన కీలక నేత..!

YSRTP  : ఇప్పుడిప్పుడే తెలంగాణలో పురుడు పోసుకుంటున్న వైఎస్సార్ తెలంగాణ (YSRTP) పార్టీకి బిగ్ షాక్ ఇచ్చారు ఆ పార్టీ కీలక నేత ఇందిరా శోభన్.. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. రాజీనామాకి సంబంధించిన కారణాలను వివరిస్తూ.. ఆమె మీడియాకి ఓ లేఖను విడుదల చేశారు.

వైఎస్ షర్మిల.. వైఎస్సార్ తెలంగాణ పార్టీపెట్టినప్పటి నుంచి పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. పార్టీ ఆవిర్భావం రోజున ఇందిరా శోభన్ ఇచ్చిన స్పీచ్ కార్యకర్తల్లో ఫుల్ జోష్ ని ఇచ్చింది. పార్టీ డిబేట్స్‌లో కూడా ఆమె చురుకుగా పాల్గొనేవారు. అయితే ఆమె పార్టీలో చేరి పట్టుమని ఏడాది కూడా గడవకముందే ఇలా రాజీనామా చేయడం గమనార్హం.

ఇక తన భవిష్యత్తు కార్యాచరణను త్వరలో ప్రకటిస్తానని, ప్రజాజీవితంలోనే ఉంటానని ఆమె తెలిపారు. జనం కోసమే కదులుతా. ప్రజల కోసమే అడుగులు వేస్తానని అన్నారు. తాజా సమాచారం మేరకు ఆమె త్వరలో కాంగ్రెస్ లో చేరనున్నారని తెలుస్తుంది.

Also Read :