home page

ఎంపీ అని కూడా చూడలేదు.. రఘురామకి చుక్కలు చూపించిన ఏపీ సీఐడీ పోలీసులు..! 
 

మూడు గంటల పాటు నడిచిన హైడ్రామా..! 
 | 
ఎంపీ అని కూడా చూడలేదు.. రఘురామకి చుక్కలు చూపించిన ఏపీ సీఐడీ పోలీసులు..!

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని ఆయన నివాసానికి చేరుకున్న సీఐడీ పోలీసులు ఆయనని అరెస్ట్ చేశారు. ఓ ఎంపీ అని కూడా చూడకుండా బలవంతంగా రఘురామను వాహనంలో ఎక్కించుకుని తీసుకువెళ్ళారు పోలీసులు. 

ఎలాంటి అరెస్ట్ వారెంట్ లేకుండా రఘురామని అరెస్టు చేశారని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఐపీసీ సెక్షన్ 124(b) ,CRPC , సెక్షన్ 52,  క్రైమ్ నెంబర్ 12/21 కింద అరెస్టు చేస్తున్నట్లు నోటీసులు గోడకు అంటించి రఘురామను తీసుకెళ్లారు పోలీసులు.. మంగళగిరి సీఐడీ కార్యాలయంలో నమోదైన కేసులో అరెస్ట్ చూసినట్టుగా అందులో పేర్కొన్నారు. ఏమైనా ఉంటే కోర్టులో చూసుకోండని కుటుంబ సభ్యులకు వెల్లడించారు.

రఘురామ అరెస్టు సమయంలో కాస్త ఉద్రిక్తత నెలకొంది. ఆయన అరెస్ట్ ను అడ్డుకునేందుకు ఆయన సిబ్బంది చాలా ట్రై చేసింది. అయితే CRPF  ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి రఘురామను అరెస్ట్ చేశారు సీఐడీ పోలీసులు.. అటు తెలంగాణ పోలీసులకి కూడా ముందస్తు సమాచారం ఇచ్చారు. ఈ సమయంలో రఘురామని ఓ ఎంపీ అని కూడా చూడకుండా పోలీసులు ఘోరంగా వ్యవహరించారు.

ఆగండి మందులు తెచ్చుకుంటాను అని చెప్పిన కూడా వినలేదు.. ఇది అన్యాయం అంటూ ఆయన ఏదో చెప్పాలని చూసిన దానిని కూడా అడ్డుకున్నారు పోలీసులు. నా సెక్యూరిటీ ఏదని గట్టిగా అరిచినా.. ఎవరిని కూడా దగ్గరికి రానివ్వలేదు సీఐడీ పోలీసులు.. మరోసారి మందులు తెచ్చుకుంటాను అని చెప్పిన లాక్కొని వెళ్ళారు.  అరెస్ట్ సమయంలో చాలా ఉద్వేగానికి లోనయ్యారు రఘురామ.

అటు ఆయన అరెస్టు పైన ఆయన కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు.. ఇది అన్యాయమని అంటున్నారు. ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. కాగా రఘురామ పుట్టినరోజు రోజున సీఐడీ పోలీసులు ఆయనని అరెస్ట్ చేయడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.