home page

KCR కళ్ళు, చెవులు మూసుకొని పరిపాలన చేస్తున్నారు.. మీ దద్దమ్మ జగన్ ఒరగబెట్టేదేంది అక్కో..! 

 | 
KCR కళ్ళు, చెవులు మూసుకొని పరిపాలన చేస్తున్నారు.. మీ దద్దమ్మ జగన్ ఒరగబెట్టేదేంది అక్కో..!

తెలంగాణ ప్రభుత్వం పై మరోసారి విమర్శలు చేశారు వైయస్ షర్మిల..కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారమే. పిల్లి కళ్ళుమూసుకొని పాలు తాగుతుంది, కేసీఅర్ గారు, కళ్ళు చెవులు మూసుకొని పరిపాలన చేస్తున్నారు. చిన్న సారు కేటీఆర్ గారికి కరోనా కష్టాలు కనిపిస్తలేవు. వినిపిస్తలేవు. రెమిడెసివిర్ ఇంజక్షన్ ల కోసం .. జనం చాంతాడంత క్యూలు కట్టేది కనిపిస్తలేదని ట్విట్టర్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అంతేకాకుండా.. Rs.3500 ఇంజక్షన్ 40 వేలు పెట్టి కొంటున్నమన్న గగ్గోలు వినిపిస్తలేదు. ఆక్సిజన్ లేక కరోనా రోగులు చస్తుంటే నాకేం పట్టి అని చూస్తున్నరు. తండ్రీకొడుకులు గారడి మాటలు పక్కన పెట్టి బెడ్లు,ఆక్సిజన్,వ్యాక్సిన్, రెమిడివిసిర్ల కొరత ఉందని ఒప్పుకొని, వాటిని ఎలా అందించాలో ఆలోచించండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది షర్మిల.


అయితే షర్మిల ట్వీట్స్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.ఆరోగ్యం రంగంలో హైదరాబాద్‌లో ఐదో స్థానంలో ఉందని మీ పత్రిక సాక్షి రాసిందని, కాస్త అప్పుడప్పుడు వార్తా పత్రికలు చూడక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా.. "మీ‌ పత్రికనే రాసింది. కనపడుతుందా.. లేక మా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కంటే వెలుగు పధకం కింద పరిక్ష చేపించమంటవా" అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.


"ట్రీట్మెంట్ కోసం ఆంధ్ర నుంచి తెలంగాణకు రోజుకు ఎంతమంది వస్తున్నది తెలుసా?? రోజుకు 20 వేలకు పైగా కేసులు, 90 పైగా మరణాలు..ఇదీ మీ దద్దమ్మ జగన్ ఒరగబెట్టేది. బెంగుళూరులో కూర్చోని టైమ్ పాస్ కి ట్వీట్లు పెట్టడం కాదు నిజాలు తెలుసుకొని మాట్లాడితే మంచిది " అంటూ హితవు పలుకుతున్నారు.