Panjagutta : పంజాగుట్ట కేసులో కొత్త ట్విస్ట్.. అంతా ఫేక్
Latest News Telangana

Panjagutta : పంజాగుట్ట కేసులో కొత్త ట్విస్ట్.. అంతా ఫేక్

Panjagutta : పంజాగుట్ట కేసులో కొత్త ట్విస్ట్ ఏర్పడింది. బోరబండ టీఆర్ఎస్ డివిజనల్ కోఆర్డినేటర్ విజయ్ సింహా తన పై దాడి చేశాడంటూ నిషా అనే యువతి పోలీసులను ఆశ్రయించింది. అయితే ఇదంతా ఫేక్ అని పోలీసులు గుర్తించారు. నిషా డ్రామాలాడుతున్నట్లుగా పోలీసులు పసిగట్టారు. విజయ సింహాను ఇరికించేందుకు నిషా వీడియోని చేసి డ్రామా ఆడినట్లుగా పోలీసులు కనిపెట్టారు. నిషా ఒంటిపై ఎలాంటి కత్తిగాట్లు లేనట్టు పోలీసులు(Panjagutta) నిర్ధారించారు. యశోద ఆస్పత్రిలో జాయిన్ అయిన నిషా డిశ్చార్జయింది. విజయ్ తన మెడపై కోసినట్టు నిషాకు సంబంధించిన ఓ వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు.

మాజీ డిప్యూటీ మేయర్‌దే కుట్ర :

ఇదంతా మాజీ డిప్యూటీ మేయర్‌ బాబా ఫసీయుద్దీన్‌ కుట్ర అని విజయ్ సింహా చెప్పారు. తాను గతంలో అతని దగ్గర పనిచేశానని, కానీ అతని మోసాలు తెలిసినప్పటి నుంచి దూరంగా ఉంటున్నట్లుగా తెలిపాడు. తన ఎదుగుదల చూడలేక ఫసీయుద్దీన్‌ ఈ కుట్రాలకు పాల్పడుతున్నాడని విజయ్ అంటున్నడు. పోలీసులు దర్యాప్తులో అన్ని విషయాలు తెలుస్తయని వెల్లడించాడు.

Also Read :