home page

Kcr Vasalamarri : సీఎం కేసీఆర్ వాసలమర్రి వెనుకున్న అసలు కథ ఇది..!

వాసాలమర్రిలో అంతపెద్ద కార్యక్రమానికి కారణం ఇదే
 | 
cm kcr in vasalamarri

రాజకీయాల్లో సీఎం కేసీఆర్ అపరచాణిక్యుడని అంటుంటారు.. ఎప్పుడు ఏం చేయాలో అన్నీ ఆయనకి తెలుసునని రాజకీయ విశ్లేషకుల మాట. ప్రస్తుతం ప్రగతి భవన్ నుంచి ప్రజల్లోకి వెళ్లి పాలన కొనసాగిస్తున్నారు సీఎం.. రెండు రోజుల్లో నాలుగు జిల్లాను ఆయన చుట్టేశారు. ఇక తాను దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామం పైన సీఎం వరాల జల్లు కురిపించారు.

ఏడాది లోపు వాసాలమర్రిని బంగారు వాసాలమర్రిగా మారుస్తానని సీఎం హామీ ఇచ్చారు. అయితే సీఎం వాసాలమర్రి పర్యటన ఆసక్తికరమైన చర్చలు పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్నాయి. అసలు వాసలమర్రికి సీఎం కేసీఆర్ రావడానికి పెద్ద స్కెచ్ ఉందని తెలుస్తోంది. బేసిక్ గానే సీఎం కేసీఆర్ కి జాతకాల పిచ్చి అన్న సంగతి తెలిసిందే. ముందు వెనుక ఏ పని చేసిన ఓ పారి పంచాంగం చూసుకోవడం ఆయనకి అలవాటు ఉన్న పని.

ఒకపక్కా ఎంతో ప్రతిష్టాత్మకంగా సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయ పునర్నిర్మాణనికి పూనుకున్నారు. త్వరలోనే ఆలయం కూడా పూర్తి కాబోతుంది. అయితే ఈ ఆలయానికి తన ఫామ్ హౌజ్ నుంచి వెళ్లాలంటే కాశిరెడ్డి పల్లె, కొండాపూర్, వాసలమర్రి అనే గ్రామాలు ఉంటాయి. వీటిని దాటుకొని కేసీఆర్ యాదాద్రి చేరుకుంటారు. అయితే వాసలమర్రి నుంచి వెళ్తుండగా స్మశానవాటిక మార్గమధ్యంలో కనిపిస్తుంది.

దేవాలయాలకు, యాగాలు,పూజలకి వెళ్లేముందు స్మశానవాటిక గుండా పోకూడదని పలువురు పూజారులు సీఎం కేసీఆర్ కి సూచించారట.. దీనితో వాసలమర్రి గ్రామంలోని నడి మధ్యలో నుంచి హైవేకి లింక్ అయ్యేలా రోడ్డు వేసేందుకు సీఎం స్కెచ్ వేశారని తెలుస్తోంది. అందుకే ఉన్నపళంగా వాసలమర్రి పైన సీఎంకి ప్రేమ పుట్టుకొచ్చిందన్న టాక్ వినిపిస్తుంది. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో ఈ రోడ్డు నిర్మాణం జరగాలని సీఎం అధికారులను అదేశించారట.

రోడ్డు నిర్మాణానికి గ్రామస్థులు ఎవ్వరు కూడా అడ్డుపడకూడదని సీఎం  ఆ గ్రామం పైన వరాలజల్లు కురిపించారని రాజకీయ విశ్లేషకుల మాట. అయితే అక్కడ ఇచ్చిన హామీల  ఎంతవరకు నెరవేరుస్తారు అన్నది చూడాలి మరి. 

Read Also :

 - దత్తత గ్రామం వాసాలమర్రిపై సీఎం కేసీఆర్‌ వరాల జల్లు..! 

అరియానాకు లేని దురద ఆంధ్రజ్యోతికి ఎందుకు.?

-ఈటల  బాటలో ఎర్రబెల్లి.. ఎందుకంటే..?

ఆటను వదిలేసి యువతి తొడల పై ఫోకస్ ... గొంతు కలిపిన కామెంటేటర్..! 

మీకు సినిమా పిచ్చి ఉందా.. అయితే ఈ రెండు లక్షలు మీవే.. మోదీ సర్కార్ ఆఫర్...! 

ఏందయ్యా ఇంటర్వ్యూ.. పచ్చి.. పచ్చిగా..! యాంకర్ అరియానాతో బోల్డ్ ఇంటర్వ్యూ 

రాటు తేలిన రంగమ్మత్త.. కొత్త అందాలు నా భూతో న భవిష్యత్.. !