home page

దిల్ తో పాగల్ హై.. పెళ్లి పీటలెక్కనున్న ఇమ్రాన్ ఖాన్, రేఖ..!!
 

 | 
దిల్ తో పాగల్ హై.. పెళ్లి పీటలెక్కనున్న ఇమ్రాన్ ఖాన్, రేఖ..!!


అరవై రెండేళ్లు వచ్చినా ఏ మాత్రం తగ్గని అందం అలనాటి అందాల నటి బాలీవుడ్ హీరోయిన్ రేఖ సొంతం. అందంలో, ఆహార్యంలో నేటి నటీనటులతో పోటీ పడుతుంది. ఏదైనా ఫంక్షన్ కు అటెండ్ అయితే అందరి చూపులు ఆమె వైపే ఉంటాయి. ఏమా అందం, ఏమా సౌందర్యం అని అనుకోని వారు వుండరంటే అతిశయోక్తి కాదు. ఇక ఇప్పుడు ఆమె పెళ్లి టాపిక్ ప్రస్తావనకు వచ్చింది. 

ఓ తోడు లేకుండా ఒంటరిగా మిగిలిపోయిన ఈ బ్యూటీకి పాక్ మాజీ క్రికెటర్, ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను జత చేసి నెట్టింట్లో పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చారు. ఇది ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. క్రికెటర్లు నటీ నటులను ప్రేమించడం, పెళ్లిళ్లు చేసుకోవడం మామూలే. అాదే కథనాన్ని ప్రస్తావిస్తూ ఇమ్రాన్, రేఖ దాదాపుగా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారని, సినిమాలు, షికార్లు, బీచ్ లు, పార్కులు చుట్టేశారని ఆ కథనంలో రాశారు.  

ఇక సినీ తారలతో డేటింగ్ గురించి ఇమ్రాన్ తన అభిప్రాయం ఏమిటో కూడా రాసుకొచ్చారు. మొఖానికి మేకప్ వేసుకుని వెండి తెరపై వెలిగిపోతున్న తారలతో సహచర్యం కొంతకాలమే బాగుంటుందని, ఆ బంధాన్ని పెళ్లితో ముడివేసి కలకాలం కాపురం చేయడమంటే కష్టమని, అందుకే నటిని పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ ఆలోచించలేదని ఇమ్రాన్ తన మనసులోని మాటను వెల్లడించినట్లు కథనంలోని సారాంశం.