home page

కరోనా చావులకు అసలు కారణాలేంటి..?

కార్పొరేటు హాస్పిటళ్ల కాసుల కక్కుర్తికి గాల్లో కలుస్తున్న ప్రాణాలు
 | 
what is the reason behind corona deaths

- కరోనా టైంలో కార్పొరేట్,ప్రైవేటు హాస్పిటల్స్ దోపిడి

- సరైన ట్రీట్మెంట్ ఉండదు.. బిల్లులు మాత్రం లక్షల్లో

- వచ్చిరాని ట్రీట్మెంట్ తో గాల్లో కలుస్తున్న పేషెంట్ల ప్రాణాలు..!

కరోనా మహమ్మారి ఎంతో మందిని కబలించింది. మరెంతో మందిని అనాథలను చేసింది. ఇంకెంతో మంది తమ కుటుంబాల్లో పెద్ద దిక్కును కోల్పోయేలా చేసింది. మొదట కరోనా వచ్చిందంటే చుట్టు పక్కల వారు ఆ దరిదాపుల్లోకి కూడా పోయేవారు కాదు. కానీ ఇప్పుడు మాస్క్ పెట్టుకుని ఆరడుగుల దూరంలో అయినా నిలబడుతున్నారు.

మొదట కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఎవరూ వైద్యం చేసేవారు కాదు. కానీ ఇప్పుడు మేము వైద్యం చేస్తామంటూ బోర్డులు పెడుతున్నారు.. కరోనా వచ్చినా.. హోం ఐసోలేషన్ లో ఉండి ప్రభుత్వాస్పత్రిలో ఇచ్చిన మందులు వాడి నయమైనవారూ చాలామందే ఉన్నారు. కానీ ఏదైనా కాస్త ఇబ్బంది అనిపించి ఆస్పత్రికి వెళ్తే ఆ మనిషి తిరిగి వస్తాడోలేదోననే భయం ప్రస్తుతం వెంటాడుతోంది.

ఇటీవల హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్ లో జరిగిన సంఘటన చూస్తే అక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉందో అర్థమవుతుంది. ఎలాంటి తీవ్రమైన సమస్యలు లేకుండా ఉన్న తన సోదరుడిని హాస్పిటల్ కు తీసుకెళ్తే అన్యాయంగా చంపేశారని ఓ చెల్లెలు కన్నీరు పెట్టుకుంది. గుండెలు బాదుకుంది. తన అన్నకు ట్రీట్మెంట్ సరిగా అందడంలేదని పదే పదే డాక్టర్లకు చెప్పినప్పటికీ వారు అవేమీ పట్టించుకోకుండా మోతాదుకు మించి స్టిరాయిడ్స్ ఇచ్చారని, దీంతో లంగ్స్, కిడ్నీలు పాడవుతున్నాయని ఆమె చెప్పింది.

అసలు కరోనా పేషెంట్ కు చేయాల్సిన ట్రీట్మెంట్ కాకుండా వేరే ట్రీట్మెంట్ చేశారని ఆమె అంటోంది. కిడ్నీలు పూర్తిగా పాడైన తర్వాత డయాలసిస్ చేసే ప్రయత్నం చేసి, చివరకు చేతులెత్తేశారని రోదిస్తోంది. తన అన్న చావుకు వైద్యులు కారకులయ్యారని ఆ చెల్లెలు తిరగబడింది. దీంతో వారు చెల్లించిన డబ్బులను తిరిగి ఇస్తామని ఆస్పత్రి యాజమాన్యం చెబుతుండగా.. మాకు డబ్బులు వద్దు మా అన్న ప్రాణాలు కావాలని నిలదీస్తోంది.

తాను కాస్త అవగాహన వ్యక్తి కాబట్టి.. తెలిసిన డాక్టర్లతో మాట్లాడి అసలు తన అన్నకి ఏం ట్రీట్మెంట్ జరిగిందనేది తెలుసుకోగలిగింది. ఏ మందు ఏ రోగానికి వాడతారో కూడా తెలుసుకుంది. కానీ సామాన్యుల పరిస్థితి ఏంటి..? కార్పొరేట్, ప్రైవేటు హాస్పిటల్స్ లో వారికి ఏ విధమైన వైద్యం అందిస్తున్నారు..? అసలు వైద్యం అందిస్తున్నారా..? లేక ట్రీట్మెంట్ చేస్తున్నట్టు నటించి డబ్బులు దోచుకుంటున్నారా..? అనేది ఇప్పుడు అందరి మదిని తొలిచివేస్తున్న ప్రశ్న.

సాధారణంగా కరోనా పేషంట్లు ఇళ్ళల్లోనే తగు జాగ్రత్తలు తీసుకొని కోలుకుంటున్నవారు చాలామంది ఉన్నారు. ఇక భయానికి చనిపోతున్నారని కొందరు.. ఇమ్యునిటీ పవర్ లేక మరికొందరు మరణిస్తున్నారని డాక్టర్లు చెబుతున్న మాట.

ఇప్పటి వరకు పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇంతమంది చావులకు కరోనా వైరస్సే కారణమా..? లేక... ఇమ్యూనిటీ లేకపోవడమా..? లేక కరోనా వచ్చిందనే భయమా..?  అంతా బాగానే ఉన్నా.. వైద్యుల నిర్లక్ష్యమే వారి ప్రాణాలు తీసిందా..?

కార్పొరేట్ హాస్పిటల్స్ లో కరోనా పేరుతో వ్యాపారం జరుగుతోందని ఏడాదిగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇదిగో చర్యలు.. అదిగో చర్యలంటూ.. కాలయాపన తప్ప.. ఇప్పటి వరకు సర్కారు స్పందించి సరైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

  • కొత్తకొండ శంకర్, జర్నలిస్ట్, అడ్వకేట్

Read Also :

ఈటల రాజేందర్... రెడ్డి..? బీసీ..? కన్ఫ్యూజన్ కథలు..!

అనసూయ అందాలు అదరహో..!

ఇమ్యూనిటీ పెంచే మల్లెపూల ఛాయ్..!

తిన్నది అరగడం లేదా..? అయితే ఇలా చేయండి..!

తెలంగాణ బీజేపీ మాస్టర్ ప్లాన్.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాందేవ్ బాబాపై దేశద్రోహం కేసు..! పెద్ద షాకిచ్చిన IMA..!

పత్తిత్తు మీడియా ప్రవచనాలు.. అందరూ ఆ బాపతే..!! 

అబ్బాయిలకి ఫుల్ క్రష్ గా మారిన 30 weds 21అమ్మాయి..! 

తెల్ల చీర.. తెల్లతోలు.. అబ్బబ్బా.. ఏమి అందం.. 

అందాల దివి... ఒక్కో ఫోటో అరాచకం..!