home page

టీవీ9కు ఎందుకీ గులగుల..? ప్రతీదాన్ని ఎందుకు కెలుకుతుంది..?

ఆనందయ్య మందు ఇష్యూలో టీవీ9పై నెటిజన్ల ఆగ్రహం
 | 
TV9Telugu propaganda over anandayya medicine

- టీవీ9పై సోషల్ మీడియాలో తిట్ల వర్షం

- ఆనందయ్య మందుపై తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం

- బ్యాన్ టీవీ9 అంటూ పోస్టులు

మెరుగైన సమాజం కోసం.. అనే ట్యాగ్ లైన్ తో సమాజం లోని అన్ని ఇష్యూల్లో వేలు పెట్టడం టీవీ9కు బాగా అలవాటు. ఏ ఇష్యూ జరిగినా అందులోకి ఎంటరైపోయి గంటలకొద్ది చర్చా కార్యక్రమాలు పెట్టడం.. కంప్లీట్ గా నెగెటివ్ యాంగిల్లో డిస్కషన్స్ కొనసాగించి రేటింగ్ పెంచుకోవడం టీవీ9 న్యూస్ ఛానల్ కు ముందు నుంచీ అలవాటైన పని.

మరీ ముఖ్యంగా పండుగలు, కొన్ని మతాల నమ్మకాలపై గతంలో టీవీ9 చాలా రచ్చే చేసింది. శబరిమల ఇష్యూ మొదలు పలానా పండుగ పలానా రోజే ఎందుకు నిర్వహించాలనే.. లాంటి చాలా కాంట్రవర్సీ ఇష్యూలపై డిస్కషన్స్ పెట్టి రోజుల తరబడి జనం అటెన్షన్ ను గ్రాబ్ చేసేందుకు ప్రయత్నించింది.

కాంట్సవర్సీ టైటిల్స్ పెట్టి, మతపెద్దలను, హేతువాదులను లైవ్ లోకి తీసుకుని వారి మధ్య చర్చను... కొట్లాట వరకు తీసుకెళ్లి ఛానల్ రేటింగ్ పెంచుకునే ప్రయత్నాలు టీవీ9లో కొన్ని వందలసార్లు జరిగాయనే చెప్పాలి. అప్పుడే కాదు.. ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి.

అందులో ఒకరు.. ప్రస్తుతం ప్రజలందరు మాట్లాడుకుంటున్న ఆనందయ్య.

కరోనాకు ఆనందయ్య మందు గురించి బయటకు వచ్చినప్పటి నుంచి నెగెటివ్ ప్రాపగాండ మొదలుపెట్టింది మెరుగైన సమాజం కోసం పాటుపడే టీవీ9. అసలది మందే కాదని.. దాన్ని వాడాల్సిన అవసరం లేదు.. వాడితే ఏదో జరిగిపోతుందన్నంతగా కథనాలు వండివార్చింది. ఆనందయ్య మందుపై ప్రజల్లో ఉన్న  పాజిటివ్ నెస్ పై నీళ్లు చల్లే ప్రయత్నం చేసింది టీవీ9.

అది ఎంత వరకు వెళ్లింది అంటే.. బ్యాన్ టీవీ9 అంటూ సోషల్ మీడియాలో ప్రజలు పోస్టులు పెట్టే వరకు వెళ్లింది. ఎంత ప్రాపగాండా చేసినా.. ప్రజలు మాత్రం ఆనందయ్య మందునే విశ్వసిస్తూ వచ్చారు. లక్షలు దోచుకుంటున్న కార్పొరేట్ హాస్పిటల్స్ కంటే.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని.. ఉచితంగా ఇస్తున్న ఆనందయ్య మందే బెటర్ అనే మాట చెప్పారు.

పనిలో పనిగా టీవీ9పై దుమ్మెత్తి పోశారు. నెగెటివ్ వార్తలు వేయడం మానుకోవాలంటూ యూట్యూట్ వీడియోల కింద కామెంట్లతో పెద్ద పోరాటమే చేశారు. అయితే.. ప్రజలు చాలా వరకు ఆనందయ్య మందును స్వాగతించారు. అయినా దీనిపై నెగెటివ్ ప్రాపగాండ ఎందుకు నడిపించాల్సి వచ్చింది..?

అంటే... ఇక్కడే టీవీ9 అసలు స్ట్రాటజీ ఉంది.

సంచలన వార్తలు.. వేయడమే ఎజెండాగా టీవీ ప్రారంభమైంది. ఛానల్ ప్రసారాలు మొదలైన రోజుల్లో బ్రేకింగ్ న్యూస్ లతో ప్రజల అటెన్షన్ ను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటికీ అదే స్ట్రాటజీ కొనసాగుతోంది.

మెజారిటీ ప్రజలు ఏ అంశంపైన అయితే మాట్లాడుకుంటున్నారో.. దాన్ని టేకప్ చేసి ఏదో వివాదాన్ని క్రియేట్ చేయడం. లేకపోతే ప్రజలు అనుకుంటున్న దానికి భిన్నంగా చర్చా కార్యక్రమాలు నడిపించడం.. రోజుల తరబడి.. గంటల తరబడి అదే అంశంపై చర్చ కొనసాగించి.. ప్రజలు తమ ఛానలే చూసేలా చేయడం... ఇదంతా టీవీ9 రేటింగ్ స్ట్రాటజీ.

ప్రజల అభిప్రాయానికి భిన్నంగా ఓ అంశాన్ని ప్రసారం  చేసినప్పుడు.. తిట్టుకుంటూ అయినా జనం దాన్నే చూస్తారు. నెగెటివ్ గా అయినా.. వాళ్లు ఏం చెబుతున్నారనేది తెలుసుకునేందుకే జనం ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అలాంటప్పుడు లైవ్ లో గానీ, యూట్యూబ్ లోని గానీ ఖచ్చితంగా ఆ డిస్కషన్ చూస్తారు. ఫలితంగా ఛానల్ రేటింగ్ పెరుగుతుంది. అడ్డగోలుగా యాడ్స్ వస్తాయి. ఇంకేముందు ఫుల్లుగా ఆదాయం.

అందుకే తమ మత విశ్వాసాలను దెబ్బతీసేలా టీవీ9 వార్తలు వేస్తోందంటూ చాలాసార్లు.. ఆ ఛానల్ ముందు దర్నాలు జరిగాయి. చాలా రోజుల పాటు ఛానల్ ముందు పోలీస్ సెక్యూరిటీ పెట్టుకోవాల్సి వచ్చింది. పాత మేనేజ్ మెంట్ పోయి... హిందూమత గురువైన చినజీయర్ స్వామి శిష్యుడు మైహోం రామేశ్వరరావు దాన్ని టేకోవర్ చేసినా.. అందులో వచ్చే వార్తలు మాత్రం మారలేదు.

ఎందుకంటే... దిస్ ఈజ్ బిజినెస్..

Read Also :

రెచ్చిపోయిన దివి పాప.. ఏం ఉంది నా సామిరంగా

కరోనా చావులకు అసలు కారణాలేంటి..?

ఈటల రాజేందర్... రెడ్డి..? బీసీ..? కన్ఫ్యూజన్ కథలు..!

అనసూయ అందాలు అదరహో..!

ఇమ్యూనిటీ పెంచే మల్లెపూల ఛాయ్..!

తిన్నది అరగడం లేదా..? అయితే ఇలా చేయండి..!

తెలంగాణ బీజేపీ మాస్టర్ ప్లాన్.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

పత్తిత్తు మీడియా ప్రవచనాలు.. అందరూ ఆ బాపతే..!! 

అబ్బాయిలకి ఫుల్ క్రష్ గా మారిన 30 weds 21అమ్మాయి..! 

లక్షద్వీప్ గొడవేంటీ..? కేంద్రం ఎందుకు నోరు మూసేసుకుంది..?