Yadadri TRS : యాదాద్రిలో టీఆర్ఎస్ ఆరగింపు సేవ.. ఓటర్లకు స్పెషల్ దర్శనం
Latest News Telangana

Yadadri TRS : యాదాద్రిలో టీఆర్ఎస్ ఆరగింపు సేవ.. ఓటర్లకు స్పెషల్ దర్శనం

Yadadri TRS : మునుగోడు ఓటర్లను ఆకట్టుకోవడానికి అన్ని పార్టీలు విశ్వప్రయాత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే మునుగోడు నియోజకవర్గంలోని దండుమల్కాపురం గ్రామస్థులను యాదగిరిగుట్ట దర్శానానికి తీసుకెళ్లారు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి(Yadadri TRS). ఆ గ్రామానికి ఆయనే టీఆర్ఎస్ ఇంచార్జ్గా ఉన్నారు.

ఈ రోజు ఉదయం గ్రామస్తులందరిని 15 బస్సుల్లో యాదాద్రి నారాసింహుని దర్శానానికి తీసుకెళ్లారాయన. ఆ బస్సులను నేరుగా కొండ పైకి అధికారులు కూడా అనుమతించారు. వారందరికి 150 రూపాయల దర్శనం చేయించారు జీవన్ రెడ్డి. అయితే వీరందరూ గుట్టపైకి చేరుకునే సరికి మధ్యాహ్నం 12 అయింది. ఆ సమయంలో స్వామివారి ఆరగింపు సేవ జరగుతుంది.

కానీ అధికారులు దాన్ని నిలిపేసి దండుమల్కాపురం ఓటర్లకు కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనం చేయించారు. దీంతో అధికారుల పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటు యాదాద్రిలో ప్రస్తుతం భక్తుల రష్ వీపరీతంగా ఉంది.

Also Read :