నాలుగైదు రోజులు ఆగరాదవ్వ.. పత్తి ఏరటానికి రాను..ప్రచారానికి పోవాలే..!
Latest News Telangana

నాలుగైదు రోజులు ఆగరాదవ్వ.. పత్తి ఏరటానికి రాను..ప్రచారానికి పోవాలే..!

ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసిన హుజురాబాద్ బై ఎలక్షన్ ముచ్చటే.. ప్రధాన పార్టీలన్నీ ఈ ఉపఎన్నికని సీరియస్ గా తీసుకున్నాయి. గెలవడానికి అన్నీ అస్త్రాలు రెడీ సందిస్తున్నాయి. ఈ ఉపఎన్నికకి మరో ఆరు రోజులే సమయం ఉండడంతో ప్రచారం ఊపందుకుంది. దీనితో ప్రచారానికి పోటీ పడి మరి నేతలు .. వ్యవసాయ పనుల కోసం కూలీలుగా వెళ్ళే మహిళలను ప్రచారానికి  తీసుకెళ్తున్నారు. దీంతో వ్యవసాయ పనులకో కొరత నెలకొంది. ఈ క్రమంలో ఓ గ్రామానికి చెందిన ఇద్దరు మహిళల ముచ్చట గిట్లున్నది..!

వెంకవ్వ : ఓ నర్సవ్వ రేపు పత్తి ఏరటానికి రావలె..
నర్సవ్వ : ఏ.. లే… ప్రచారానికి పోవాలె… ఓ నాలుగైదు రోజులు ఆగరాదవ్వ.. ఎలచ్చన్లు అయిపోతాయ్… నీ పనికే వత్తా..
వెంకవ్వ : నీ ప్రచారం సల్లగుండ… రోజుంటదా నర్సవ్వ.. గీ ప్రచారాలు.. ఎలచ్చన్లు..!
నర్సవ్వ : కూలీ పనికి పోయిన.. ఎలచ్చన్లు మీటింగ్ కి పోయిన గవ్వే పైసలు కదా ఎంకవ్వ.. ఇంకా రోజుకు రెండు మూడు మీటింగ్ లకి పోతే ఎక్కువిత్తుర్రు పైసలు
వెంకవ్వ : మంచిగున్నది పో నీ పని.. గింతకీ ఎవలి ప్రచారానికి పోతున్నవ్..
నర్సవ్వ : గివిల్లు, గావాళ్ళు అని ఏం లేదు… ఎవ్వలు పైసలెక్కివిత్తే గావాళ్ళకే.. వాళ్ళకి జనం కావలె.. మనకి పైసలు కావలె..
వెంకవ్వ ; నువ్వు నీ పెనిమిటి ఇద్దరు చెరో పార్టీకి పోతుర్రాట కదా..
నర్సవ్వ : బరాబర్ పోవుడే ఎంకవ్వ… ఇంకా రేపు మూడు రోజులల్లా పెద్దపెద్దోల్లు వస్తుర్రట… ఇంకేకవ్వనే ఇస్తరట పైసలు..
వెంకవ్వ : సరే మంచిది గాని ఈ ప్రచారాలు అయినంక అయితే పత్తి ఏరటానికి రా మరి.. యాదికి పెట్టుకో..
నర్సవ్వ : గట్లనే ఎంకవ్వ,. నీ పనికే వత్తా..
వెంకవ్వ : ఓ లచ్చవ్వ ఇల్లు సుసుకుంటూ ఉండు..ఆటో వచ్చింది పోయత్తా..!

Also Read :