TPCC chief : జర్నలిస్ట్ శంకర్ ను రేవంత్ ఎందుకు బూతులు తిట్టారు.?
Latest Telangana

TPCC chief : జర్నలిస్ట్ శంకర్ ను రేవంత్ ఎందుకు బూతులు తిట్టారు.?

Why TPCC chief Revanth reddy Threatened journalist shanker : తెలంగాణ కాంగ్రెస్ సంక్షోభం నానాటికి ముదురుతోంది. పాత, కొత్త కాంగ్రెస్ నేతలు కాస్త సైలెంట్ అయినా.. ఇంటర్నల్ గా పెద్ద యుద్ధమే నడుస్తున్నదని టాక్. ఇది పార్టీని ఎందాక తీసుకెళ్తుందోనని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే.. ఇప్పుడు మరో అంశంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి (TPCC chief) కొత్త పార్టీ పెట్టబోతున్నారని సమాచారం.. అంటూ ట్వీట్ చేసిన జర్నలిస్ట్ శంకర్ కు స్వయంగా రేవంత్ రెడ్డి పర్సనల్ ఫోన్ నుంచి కాల్ వెళ్లింది. అందులో ఆయన బూతులు తిట్టారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు.

సాధారణంగా జర్నలిస్టులకు ఏదైనా సమాచారం వస్తే.. ప్రశ్నార్థకం, ఆశ్చర్యార్థకం పెట్టి వార్తలు రాస్తుంటారు. ఇది చాలా కాలంగా జరుగుతోంది. జర్నలిస్ట్ శంకర్ కూడా తాను అదే విధంగా తన సోర్స్ ద్వారా వచ్చిన సమాచారంతో ట్వీట్ చేశానని చెప్పారు.

Read Also :

ఇలాంటి వార్తలు రావడం కామన్. కానీ ఓ జర్నలిస్ట్ కు పీసీసీ చీఫ్ (TPCC chief)పర్సనల్ నంబర్ నుంచి ఫోన్ ఎందుకు వెళ్లింది..? అంతలా ఆయన ఎందుకు రియాక్ట్ అయ్యారనేది సస్పెన్స్ గా మారింది.

అయితే.. దీని వెనకాల వేరే కథ ఉందని తెలుస్తోంది. రహస్యంగా కొత్త పార్టీ పెట్టాలనేది ఆయన వర్గం ప్లాన్ గా తెలుస్తోంది. ఎలాగూ కాంగ్రెస్ లో గొడవలు నడుస్తున్నాయి. ఏదో తేడా కొట్టం పక్కా. కాబట్టి సమయం దొరికినప్పుడు తన బ్యాచ్ ను వేసుకుని కొత్త పార్టీని ప్రజలకు పరిచయం చేయాలని రేవంత్ భావించారని సన్నిహిత వర్గాల సమాచారం.

కానీ.. ఆయన వెంట ఉన్నవాళ్లో, కాంగ్రెస్ లోని పాత లీడర్లో.. ఈ విషయాన్ని జర్నలిస్ట్ శంకర్ చెవిన వేసినట్టున్నారు. దీంతో ఆయన ట్వీట్ చేశారు.

తాను గుట్టుగా నడిపిస్తున్న వ్యవహారం రట్టు కావడంతోనే రేవంత్ అంతలా సీరియస్ అయ్యారని సమాచారం. ఆ రోజంగా ఆయన చాలా సీరియస్ గా ఉన్నారని సన్నిహితులు చెప్పారు. మరోవైపు.. ఈ ఇష్యూపై ఢిల్లీ నుంచి కూడా ఫోన్లు రావడంతో రేవంత్ రెడ్డి ఆగ్రహం కట్టలు తెంచుకుందని అంటున్నారు.

అటు.. రేవంత్ వర్గం కూడా జర్నలిస్ట్ శంకర్ కు ఫోన్లు చేయడం, సోషల్ మీడియాలో బెదిరింపు మెస్సేజ్ పెట్టడం నడుస్తున్నది. ఇది కూడా పీసీసీ చీఫ్ డైరెక్షన్ లోనే జరుగుతున్నట్టు సమాచారం.

అందుకే జర్నలిస్ట్ శంకర్ కు పర్సనల్ నంబర్ నుంచి ఫోన్ చేసి మరీ బూతులు తిట్టారని తెలుస్తోంది. సార్ సీరియస్ గా ఉన్నారని రేవంత్ రెడ్డి (TPCC chief)పీఏ కూడా ఫోన్లో చేప్పింది.. సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యింది.

Read Also :