Why kcr planning BRS public meeting in Khammam : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 18న ఖమ్మంలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. లక్షలాది మందితో ఈ సభ నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి మూడు రాష్ట్రాల సీఎంలు, జాతీయ స్థాయి నేతలు హాజరుకానున్నారని సమాచారం. సభ నిర్వహణ బాధ్యతలు మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కి అప్పగించారు.
భారత్ రాష్ట్ర సమితి ప్రకటించిన తర్వాత భారీ బహిరంగ సభలు (BRS public meeting) నిర్వహించలేదు. దసరా నాడు, ఆ తర్వాత పార్టీ పేరు మారుతూ అధికారిక ఉత్తర్వులు వచ్చిన రోజు తెలంగాణ భవన్ లో కార్యక్రమాలు నిర్వహించారు. అంతకుమించి BRS సభల హడావుడి కనిపించలేదు.
సంక్రాంతి తర్వాత బీఆర్ఎస్ దూకుడు పుంజుకుంటుందని స్వయంగా కేసీఆర్ ప్రకటించారు. జాతీయ స్థాయిలో పర్యటనలో కూడా ఉంటాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే.. అంతా బాగానే ఉంది కానీ.. ఖమ్మంలోనే కేసీఆర్ సభ ఎందుకు పెట్టాలనుకున్నారనే చర్చ సర్వత్రా జరుగుతోంది.
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.. అన్నట్టుగా కేసీఆర్ ప్లాన్ చేశారనే ప్రచారం జరుగుతోంది. కొద్దిరోజులుగా ఖమ్మం జిల్లా రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. పలువురు బీఆర్ఎస్ నేతలు పార్టీ మారుతున్నారనే ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీ గూటికి వెళ్తున్నారని ప్రచారం జోరందుకుంది. పలు బీజేపీ అనుకూల పత్రికలు కూడా ఈ వార్తలు రాయడంతో.. వారు కమలం గూటికి చేరడం దాదాపు ఖాయమైందనే చర్చ జరుగుతోంది.
దీంతో ఖమ్మం బీఆర్ఎస్ లో అనిశ్చితిని తొలగించి వ్యవస్థను సెట్ చేయడంతో పాటు.. కార్యకర్తలు చేజారిపోకుండా ఉండేందుకే.. ఖమ్మంలో సభ పెడుతున్నారని తెలుస్తోంది.
ఖమ్మం జిల్లా ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉంది. ఇటీవలే అక్కడ్నుంచి కూడా కొందరు నేతలు బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. దీంతో ఏపీలోనూ బీఆర్ఎస్ ప్రభావం చూపించాలనే ఉద్దేశంతోనే ఖమ్మంలోనే సభకు (BRS public meeting) ప్లాన్ చేశారంటున్నారు.
ఏపీ నుంచి భారీగా జనసమీకరణ చేసి బల ప్రదర్శన చేయాలనే ఉద్దేశంతోనే ఖమ్మం వేదికగా సభ పెడుతున్నారని పార్టీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. దీని ద్వారా ఏపీలోనూ కీలక నేతలను బీఆర్ఎస్ లోకి ఆకర్షించేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని టాక్.
Read Also :
- KCR : కేసీఆర్‌కు వరుస షాకులు..!
- BRS చీఫ్‌గా బండ ప్రకాష్.. కేసీఆర్ నయా స్కెచ్..!
- Divi Vadthya : పైన జాకెట్ కింద షార్ట్…ఫుల్ డోస్
- Hit2లో కన్నింగ్ ఝాన్సీ.. ఈ అనంతపురం పిల్లనే
- Akhila Ram : మసూద పాప మాములుగా లేదుగా..!
- Ramya Raghupathi : నరేష్‌ను వదలా… పవిత్రతో పెళ్లి కానివ్వ