Kcr friend : తేడా కొట్టిందా..? కావాలనే పిలవలేదా..?
Latest Telangana

Kcr friend : తేడా కొట్టిందా..? కావాలనే పిలవలేదా..?

why kcr friend not attended to khammam public meeting : ఖమ్మంలో బీఆర్ఎస్ నిర్వహించిన భారీ బహిరంగ సభ ధూంధాంగా జ‌రిగింది. కేసీఆర్ అనుకున్న జనం కంటే ఎక్కువమందే వచ్చారు. జాతీయ స్థాయి నాయ‌కుల్ని ఆహ్వానించి భారీ బహిరంగ సభను నిర్వహించిన కేసీఆర్.. తన పార్టీకి జాతీయ స్థాయి అటెన్షన్ తీసుకురావడంలో మాత్రం గ్రాండ్  సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

కేసీఆర్ ఆహ్వానం మేరకు ఢిల్లీ, పంజాబ్‌, కేర‌ళ సీఎంలు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాద‌వ్‌, సీపీఐ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి డి.రాజా హాజ‌ర‌య్యారు. కర్ణాటక నుంచి  కుమారస్వామి, బిహార్  నుంచి నితీష్ కుమార్ రావాల్సి ఉంది కానీ స్థానికంగా ముఖ్యమైన పనులు ఉండ‌డంతో రాలేక‌పోయిన‌ట్టుగా కేసీఆర్ కు చెప్పారు.

అయితే ఈ సభలో కేసీఆర్ కు మంచి ఆప్తుడైన ఎంఐఎం అధినేత‌  అస‌దుద్దీన్ ఓవైసీ హాజరుకాకపోవడం అందర్నీ షాక్ కు గురిచేసింది. కేసీఆర్ వ్యూహాత్మకంగా ఆయనను  ఆహ్వానించలేదన్న  చర్చ పొలిటికల్  సర్కిల్ లో జోరుగా వినిపిస్తుంది.

Read Also :

మతాలతో సంబంధం లేకుండా.. అన్ని మతాలు సమానమేననే ఎజెండాతో కేసీఆర్ ముందుకెళ్తున్నారు. పూర్తిగా హిందూత్వ ఎజెండాతో, కార్పొరేట్ పక్షపాత వైఖరితో ముందుకెళ్తున్న బీజేపీపై యుద్ధం ప్రకటించారు. ఇతర మతాలను రెచ్చగొట్టేలా బీజేపీ నేతలు చేస్తున్న ప్రసంగాలు, కార్యక్రమాలపై చాలాసార్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

అయితే.. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని AIMIM పార్టీ పూర్తిగా బీజేపీలాంటి మతతత్వ పార్టీనే అన్నది ఓపెన్ సీక్రెట్. బీజేపీ హిందూత్వాన్ని ముందు పెట్టి ఓట్లు అడిగితే.. మజ్లిస్ పార్టీ ముస్లిం ఓటు బ్యాంకును నమ్ముకుని నడుస్తోంది.

ఇలాంటి పార్టీ నాయకుడిని ఖమ్మం సభకు పిలిస్తే అది జనంలోకి తప్పుడు సంకేతాలను పంపే ప్రమాదముంది. అంతే కాదు.. సర్వమత సమ్మేళనం అనే నినాదంతో ముందుకెళ్తున్న కేసీఆర్ ను బీజేపీ ప్రతీసారి టార్గెట్ చేస్తోంది. కేసీఆర్ హిందూ వ్యతిరేకి అంటూ ఆరోపణలు చేస్తోంది. ఇలాంటి టైంలో ఒవైసీని సభకు పిలిస్తే బీజేపీ చేతికి మరో బలమైన అస్త్రం ఇచ్చినట్టవుతుంది. అందుకే ఖమ్మం సభకు మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీని పిలవలేదని తెలుస్తోంది.

Read also :