kalvakuntla kavitha : కవిత ఎక్కడ? ప్రగతిభవన్‌‌లో అసలు ఏం జరుగుతుంది?
Latest News Telangana

kalvakuntla kavitha : కవిత ఎక్కడ? ప్రగతిభవన్‌‌లో అసలు ఏం జరుగుతుంది?

kalvakuntla kavitha : దేశవ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ వేడుకలు అంబరాన్ని అంటాయి. అందులో భాగంగానే తెలంగాణ సీఎం అధికార నివాసం ప్రగతిభవన్ లో రాఖీపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్‌‌కి అక్కలైన ల‌క్ష్మమ్మ, జ‌య‌మ్మ, ల‌లిత‌మ్మ ముగ్గురు క‌లిసి కేసీఆర్‌కు హారతి పట్టి, రాఖీ కట్టి స్వీట్స్ తినిపించారు. ఈ వేడుకల్లో మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కూడా ఉన్నారు.

Image

అంతబాగానే ఉంది కానీ సీఎం కేసీఆర్ కూతురు కవిత ఎక్కడ? అన్నది అసలుసిసలు పాయింట్.. రాఖీ వేడుకల్లో సెంటరాఫ్ అట్రాక్షన్ అంటేనే కవిత.. కేటీఆర్‌‌కు ప్రతి ఏటా రాఖీ కట్టే కవిత ఈసారి కనిపించకపోవడం హాట్ టాపిక్ అయిపోయింది. గత ఏడేండ్లుగా ప్రగతి భవన్‌‌లో రాఖీ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఒక్కసారి కూడా ఆమె మిస్ అవ్వలేదు కూడా.

Also Read :

kavitha: TRS MP Kavitha ties rakhi on minister KTR, gifts him helmet | Hyderabad News - Times of India

అయితే ఈ సారి కేటీఆర్‌‌కి ఎంపీ సంతోష్ సోదరి, మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునిత, మేయర్ గద్వాల విజయలక్ష్మి సహా చాలామంది నేతలు రాఖీ కట్టారు. ఆ ఫోటోలను కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. అయితే ఇందులో కవిత లేకపోవడంతో కేటీఆర్‌‌కు కవిత ఎందుకు కట్టలేదని చర్చించుకుంటున్నారు. కావాలనే కట్టలేదా లేక ఆమె హైదరాబాదులో లేరా అని సందేహం అందరిలో నెలకొంది.

Image

Image

బేసిక్‌‌‌గా రాఖీ అంటేనే ఎక్కడున్న సరే.. దూర ప్రాంతాల నుంచి వచ్చి మరి సోదరులకి రాఖీలు కడుతుంటారు. అలాంటిది కవిత ఎందుకు రాలేదన్నది ప్రశ్నగా మారింది. అన్న కేటీఆర్‌‌తో కవితకు పడటం లేదనే గత కొన్నాళ్లుగా నడుస్తున్న చర్చ. వీళ్లిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం గత కొంతకాలంగా జరిగుతుంది. తాజాగా రాఖీ వేడుకల్లో ఆమె లేకపోవడం ఈ వార్తలకి మరింత తావిస్తుంది.\

Image