Telangana congress : కాంగ్రెస్ ను ముంచుతున్న “బ్లాక్ షీప్” ఎవరు..?
Latest Telangana

Telangana congress : కాంగ్రెస్ ను ముంచుతున్న “బ్లాక్ షీప్” ఎవరు..?

Who is blacksheep in telangana congress :

(తెలంగాణలోనే కాదు దేశంలోనే రాబోయేది మేమేనని కాంగ్రెస్ చెప్పుకుంటోంది. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. అటు దేశంలో.. ఇటు రాష్ట్రంలో.. పార్టీని అందులో ఉన్నవారే వెన్నుపోటు పొడుస్తున్నారనే ప్రచారం కార్యకర్తలు,నేతల్లోనే జరుగుతోంది. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ లో పరిస్థితులపై విశ్లేషణాత్మక వరుస కథనాలు…) 

తెలంగాణ రాజకీయాలు దేశం దృష్టికి ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రంపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టడంతో పరిస్థితులు మరింత ఇంట్రెస్టింగ్ గా మారాయి. ప్రతీ రోజు బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్టుగా నడుస్తోంది. జాతీయపార్టీగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ హడావుడి మాత్రం పెద్దగా కనిపించడం లేదు.

వాస్తవానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు తీసుకున్నాక.. కేడర్ లో కాస్త జోష్ కనిపించింది. పార్టీకి మళ్లీ పూర్వవైభవం వస్తుందని ఆశపడ్డారు. అదే ఉత్సాహంతో పనిచేశారు. అయితే రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక కొద్దిరోజులకే జరిగిన హుజురాబాద్ బైపోల్ లో కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా దక్కలేదు. వాస్తవానికి అక్కడ కాంగ్రెస్ కు బలమైన కేడర్ ఉంది.

గత అసెంబ్లీ  ఎన్నికల్లో అప్పుడు టీఆర్ఎస్ లో ఉన్న ఈటల రాజేందర్ వర్సెస్ కాంగ్రెస్ లో ఉన్న పాడి కౌశిక్ రెడ్డి అన్నట్టుగానే నడిచింది. ఆ స్థాయిలో ఉన్న ఉన్న కాంగ్రెస్ కేడర్ బైపోల్ వచ్చేసరికి పూర్తిగా కుప్పకూలిపోయింది. కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేని స్థాయికి దిగజారింది. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ పెర్ఫార్మెన్స్ అంతా చెప్పుకోదగ్గట్టుగా ఏమీ లేదు. చివరకు మొన్న మునుగోడులోనూ కాంగ్రెస్ డిపాజిట్ దక్కించుకోలేకపోయింది.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తిరిగి జీవం పోసుకోవాలంటే రేవంత్ రెడ్డి లాంటి ఫైర్ ఉన్న లీడర్ కావాలని ఏరి కోరి మరీ పట్టుకొచ్చారని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ ఫైర్ లో ఏదో ప్రాబ్లమ్ ఉందనే చర్చ ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. రేవంత్ వచ్చాక పార్టీ కేడర్ లో జోష్ పెరగడాన్ని కాసేపు పక్కన పెడితే.. అంతర్గత కుమ్ములాటలు, ముఖ్యనేతల మధ్య గొడవలు, పార్టీకి గుడ్ బై చెప్పే వారి సంఖ్య పెరిగింది.

పార్టీలో వరుస ఘటనలతో రేవంత్ వచ్చిన కొత్తలో కేడర్ లో కాస్త పెరిగిన ఆత్మస్థైర్యం.. రెట్టింపు స్థాయిలో దిగజారిపోయింది. పార్టీలో ఏం జరుగుతోంది..? పార్టీ స్టేట్ చీఫ్ ఏం చేస్తున్నారో..? అర్థం కాక అంతా తలపట్టుకుంటున్నారు.

2023 అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో కాంగ్రెస్ బలపడుతుందని కేడర్ భావించింది. కానీ ఇప్పుడు వరుసపెట్టి లీడర్లు గుడ్ బై చెప్పేస్తుండటంతో డీలా పడుతున్నారు. ముందుండి నడిపిస్తాడనుకున్న వ్యక్తే నిండా ముంచేస్తున్నాడా..? అన్న చర్చ కాంగ్రెస్ వర్గాల నుంచే వినిపిస్తోంది.

రేవంత్ పీసీసీ చీఫ్ అయిన కొద్దిరోజులకే రాష్ట్రంలో రాజకీయం హీటెక్కింది. టీఆర్ఎస్ నుంచి ఈటల రాజేందర్ బయటకు వచ్చారు. కొద్దిరోజుల పాటు ఏ పార్టీకి వెళ్లకుండా ఉండిపోయారు. ఇదే సమయంలో ఈటలతో పాటు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం జరిగింది.

కొత్తగా పీసీసీ బాధ్యతలు చేపట్టిన రేవంత్.. వీరిని పార్టీలోకి ఆహ్వానిస్తే ఆయన మైలేజ్ పెరిగేది. హుజురాబాద్ బైపోల్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఈటల బరిలోకి దిగి గెలిస్తే ఒక్కసారిగా రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ దూసుకెళ్లేదని కేడర్ కూడా భావించింది. కానీ అది జరగలేదు. ఆ తర్వాత రేవంత్ ఒంటెద్దు పోకడపై పార్టీలోని సీనియర్లు బహిరంగ విమర్శలు చేయడంతో అంతా గందరగోళంగా మారింది.

(ఇంకా ఉంది.. తర్వాతి పోస్ట్ లో మరిన్ని వివరాలు…)