Telangana Jobs : ఫార్మ్‌డి నిరుద్యోగులకి జాబ్స్ ఎక్కడ?
Latest News Telangana

Telangana Jobs : ఫార్మ్‌డి నిరుద్యోగులకి జాబ్స్ ఎక్కడ?

Telangana Jobs : ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో నిరుద్యోగులకి సీఎం కేసీఆర్  శుభవార్త చెప్పారు..రాష్ట్రంలో వివిధ శాఖలలో ఖాళీలున్న 80,039 ఉద్యోగాలను ఉన్నపళంగా భర్తీ(Telangana Jobs) చేస్తామని ప్రకటించారు. సీఎం తాజా ప్రకటనతో నిరుద్యోగులకి ఊరట లభించినట్టు అయింది.

అయితే ప్రభుత్వం ప్రకటించిన జాబ్స్‌‌లో వైద్యశాఖాలో 12,755 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. వీటిని త్వరగా భర్తీ చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. అయితే ఇందులో ఫామ్‌‌డి నిరుద్యోగులకి సంబంధించిన జాబ్స్ ఎక్కడున్నాయని సంబంధిత నిరుద్యోగులు తర్జన భర్జన అవుతున్నారు.

ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో భాగంగా డాక్టర్ ఆఫ్ ఫార్మసీ గ్రాడ్యుయేట్‌లను ఉపయోగించుకోవడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు వైద్యరంగంలో అధునాతనమైన వైద్య ప్రమాణాలను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

దీనిపైన ప్రభుత్వం వెంటనే స్పందించాలని సోషల్ మీడియా వేదికగా మంత్రి కేటీఆర్, సీఎం కార్యాలయాన్ని అభ్యర్దిస్తున్నారు.

Also Read :

ఎ మహేష్
డాక్టర్ అఫ్ ఫార్మసి
కాకతీయ యూనివర్సిటీ