Huzurabad bye election :ఢిల్లీ టూ హుజురాబాద్.. చక్రం ఎక్కడ తిరిగింది.?
Latest Telangana

Huzurabad bye election :ఢిల్లీ టూ హుజురాబాద్.. చక్రం ఎక్కడ తిరిగింది.?

What is Kcr plan on Huzurabad bye election : రాష్ట్రంలో హుజురాబాద్ ఎన్నికల వేడి కొనసాగుతోంది. ఇటు టీఆర్ఎస్.. అటు ఈటల రాజేందర్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి తరుపున మంత్రి హరీశ్ రావు, కరీంనగర్ కు చెందిన మంత్రి గంగుల కమలాకర్ ప్రచారం నిర్వహిస్తున్నారు.

టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా పెద్ద సంఖ్యలో ప్రచారంలో పాల్గొంటున్నారు. గల్లీ గల్లీ తిరిగి కారుకే ఓటేయాలని కోరుతున్నారు.

కానీ… ఈటల రాజేందర్ మాత్రం తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ చోట టీఆర్ఎస్ ను నిలదీస్తున్నారు. సీఎం కేసీఆర్ ను , మంత్రి హరీశ్ రావును నోటికొచ్చినట్టు కడిగిపారేస్తున్నారు. మొన్నటి దాకా మంచి మిత్రులుగా ఉన్న హరీశ్, ఈటల ఇప్పుడు బద్ధ శత్రువులయ్యారు.

గెలుపు విషయంలో మాత్రం ఈటల ఎక్కడా తగ్గట్లేదు. కేవలం మెజార్టీ లెక్కల గురించే మాట్లాడుతున్నారు.

కానీ.. హుజురాబాద్ (Huzurabad bye election) లో తాను ఎన్నికల ప్రచారసభ పెడతానని సీఎం కేసీఆర్ పార్టీ కార్యవర్గ సమావేశంలో చెప్పారు. ఈ నెల 25 తర్వాత హుజురాబాద్ వస్తానని కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తోంది. కానీ 27న సభకు డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.

ఇంత వరకు అంతా మామూలు విషయమే. ఇక్కడే అసలు చర్చ మొదలైంది. ఉప ఎన్నికలున్న టైంలో గెలిచే అవకాశం ఉన్న చోట మాత్రమే సీఎం కేసీఆర్ ప్రచారం చేస్తారనే మాట ప్రచారంలో ఉంది. గతంలో ఆయన ప్రచార సభలు పెట్టిన చోట దాదాపుగా అన్ని బైఎలక్షన్స్ లో టీఆర్ఎస్ విజయం సాధించింది.

గతంలో దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో మాత్రం కేసీఆర్ అక్కడ సభ పెట్టలేదు. దుబ్బాక నియోజకవర్గానికి పక్కనే ఉన్న కొడకండ్లలో అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ దుబ్బాక మాత్రం వెళ్లలేదు.

అయితే.. అక్కడ ఓడిపోతామని ముందు తెలుసు కాబట్టే కేసీఆర్ ప్రచారానికి వెళ్లలేదనే అప్పట్లో గుసగుసలు వినిపించాయి.

ఇప్పుడు హుజురాబాద్ లోనూ టీఆర్ఎస్ కు ఓటమి తప్పదని ఈటల రాజేందర్ అంటున్నారు. అయినా సరే.. కేసీఆర్ అక్కడికి వెళ్లేందుకు సిద్ధపడ్డారు. ఇప్పటికే ఓ సారి హుజురాబాద్ లో  అధికారిక సభ పెట్టారు కేసీఆర్. ఇప్పుడు ప్రచారం కోసం వెళ్లనున్నారు. అంటే గెలుపుపై పూర్తిస్థాయిలో ధీమా వచ్చాకే హుజురాబాద్ లో సభ పెట్టాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే ఢిల్లీ వెళ్లి వచ్చారు. ఎలాంటి షెడ్యూల్ లేకుండా వెళ్లిన ఆయన.. నాలుగైదు రోజులు అక్కడే ఉండి అమిత్ షా, మోడీ, ఇతర కేంద్రమంత్రులతో వరుసభేటీ నిర్వహించారు.

ఈ భేటీల్లోనే హుజురాబాద్ (Huzurabad bye election) ఎన్నికపైనా చర్చ జరిగిందనే మాట వినిపిస్తోంది.

ఢిల్లీలో గుసగుస..!

ఈటలను పట్టుబట్టి బయటకు పంపించింది టీఆర్ఎస్. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎన్నికల్లో గెలిస్తే.. అసలే ఈగో ఎక్కువున్న కేసీఆర్ కు సహించదు. అందుకే ఢిల్లీ నుంచే రాయభారం నడిపించినట్టు తెలుస్తోంది.

ఈటల గెలిచినా, ఓడినా బీజేపీకి ఇప్పటికిప్పుడు పెద్దగా ఒరిగేదేం లేదు. ఈటల గెలిచినా.. బీజేపీలోనే కంటిన్యూ అవుతారనే నమ్మకం కూడా లేదు. ఆయన మరికొందరితో కలిసి కాంగ్రెస్ లో చేరిపోతారనే ప్రచారం ముందు నుంచీ ఉంది.

అందుకే.. ఈ విషయాలన్నీ బీజేపీ పెద్దలతో మాట్లాడి.. వ్యవహారం మొత్తం చక్కబెట్టేశారని తెలుస్తోంది. అందుకే.. స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ ప్రకటించినా.. ఇప్పటి వరకు బీజేపీ నేతలు పెద్దగా హుజురాబాద్ లో కనిపించడం లేదు. ఈటల, ఆయన భార్య, వారితో పాటు బీజేపీలో చేరిన తుల ఉమ, ఏనుగు రవీందర్ రెడ్డి.. అప్పుడప్పుడు మాజీ ఎంపీ వివేక్ హుజురాబాద్ లో కనిపిస్తున్నారు. ఇవాళ మురళీధర్ రావు ప్రచారంచేశారు.

ఢిల్లీ పెద్దల నుంచి ఆదేశాలు రావడంతోనే గేమ్ మొత్తం మారిపోయినట్టు ప్రచారం జరుగుతోంది. సో.. కేసీఆర్ సభలో ఏం మాట్లాడతారు.? సభ తర్వాత పరిస్థితులు ఎలా మారబోతున్నాయనేది వేచి చూడాలి.

Read Also :