Harish Rao: హరీష్‌‌ని బయటకు పంపుడేనా..లేకా సంప్రదాయం మారుస్తారా.. కేసీఆర్ ప్లాన్ ఏంటి?
Latest News Telangana

Harish Rao: హరీష్‌‌ని బయటకు పంపుడేనా..లేకా సంప్రదాయం మారుస్తారా.. కేసీఆర్ ప్లాన్ ఏంటి?

Harish Rao:  రాజకీయాల్లో అపరచాణక్యుడిగా తెలంగాణ సీఏం కేసీఆర్ కి పేరుంది. ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకోవడంలో ఆయన మంచి దిట్ట.. తెలంగాణ క్యాబినెట్ లో ఈటెల బర్తరఫ్ తర్వాత ఖాళీగా ఉన్న ఆరోగ్య శాఖను మంత్రి హరీష్ రావు (Harish Rao) కి అప్పగించారు కేసీఆర్.. ప్రస్తుతం హరీష్… ఆర్ధిక శాఖను కూడా చూస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరోగ్య శాఖ ఎవ్వరి కూడా అచ్చొచ్చి రావడం లేదు.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముందుగా ఆ శాఖను స్టేషన్ ఘన్ పుర్ ఎమ్మెల్యే రాజయ్యకి అప్పగించారు. కొద్దిరోజులకే ఆ శాఖ నుంచి రాజయ్యను తప్పించి లక్ష్మారెడ్డికి అప్పగించారు సీఏం.

రెండోసారి ప్రభుత్వం ఏర్పడ్డాక అదే శాఖను ఈటెలకి అప్పగించారు కేసీఆర్… భూకబ్జాల ఆరోపణల నేపధ్యంలో ఈటెలను మంత్రి శాఖనుంచి తప్పించారు కేసీఆర్.. కోవిడ్ లాంటి సంక్షోభంలో అవసరమైన వైద్యశాఖకు మరో మంత్రిని కూడా కేటాయించలేదు. తాజాగా ఆ శాఖ బాధ్యతలు హరీష్ కి అప్పగించారు.

కేసీఆర్ నెక్స్ట్ టార్గెట్ హరీష్ రావే అని, అందుకే సెంటిమెంట్ గా కేసీఆర్ ఆయనకీ ఆ శాఖ ఇచ్చారన్న చర్చ ఇప్పుడు నడుస్తోంది. హరీష్ రావుని కేసీఆర్ పక్కనపెడతారన్న చర్చ ఎప్పటినుంచో నడుస్తోంది కాబట్టి దీనికి మరింత బలం చేకూరినట్టు అయింది. సరే హరీష్ రావుని కేసీఆర్ నిజంగానే పక్కన పెడతారా లేదా అన్నది ఇక్కడ అసలు పాయింట్.

టీఆర్ఎస్ పార్టీలో అయిన, ప్రభుత్వంలో అయిన కేసీఆర్ లొసుగులు తెలిసిన వ్యక్తి హరీష్ రావు..(కేటీఆర్ కంటే కూడా ). పార్టీలో నెంబర్ 2 గా హరీష్ కి ఇప్పటికి పేరుంది. కేసీఆర్ తర్వాత ఉద్యమ నాయకుడిగా హరీష్ కే పేరుంది. హరీష్ ని బయటకు పంపితే ముందుగా పార్టీకి ఎక్కడలేని డ్యామేజ్ ఏర్పడుతుంది.

ఇప్పటికే ఈటెలని బయటకు పంపి.. హుజురాబాద్ లో కోట్లు ఖర్చు పెట్టిన సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోలేదు.. పైగా ఇటు పార్టీకి, అటు ప్రభుత్వానికి పూర్తి డ్యామేజ్ ఏర్పడింది. ఇది కేసీఆర్ కి కోలుకొని దెబ్బ.. ఇప్పుడు హరీష్ ని బయటకు పంపితే ఇంకా పార్టీ భూస్థాపితం అవ్వడం పక్కా అనే చెప్పాలి.

ఇక కేటీఆర్ అభివృద్ధి పరంగా తప్పా  రాజకీయంగా  పరంగా పార్టీని నడపడంలో, ప్రభుత్వాన్ని నడపడంలో నిష్ణాతుడైతే కాదు. ఈ విషయంలో కేసీఆర్ తరవాత కేసీఆర్ అంటే మళ్ళీ హరీష్ రావే. రేపటిరోజు కేటీఆర్ సీఏం కూర్చీ మీద కూర్చున్న వ్యవహారాలు మాత్రం హరీష్ చూసుకోవాల్సిందే.. అంటే అర్జునుడు ముందుండి యుద్ధం చేస్తే… కృష్ణుడు వేనుకున్నట్టుగా  ..

అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగోచ్చు.. శాశ్వతమైన మిత్రులు.. శాశ్వతమైన  శత్రువులు ఉండరు కాబట్టి.

 

Also Read: