Raghu Rama Krishna Raju : కేసీఆర్కు రఘురామ చిక్కితే ద‌బిడి దిబిడే..!
Andhra Pradesh Latest News Telangana

Raghu Rama Krishna Raju : కేసీఆర్కు రఘురామ చిక్కితే ద‌బిడి దిబిడే..!

Raghu Rama Krishna Raju : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోనుగోలు కేసులో ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. అనుమానం వచ్చిన చాలు సిట్ నోటీసులు ఇచ్చేస్తుంది. చిన్న పెద్ద తలకాయలని అసల లెక్క చేయడం లేదు. ఈ కేసులో ఏపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు(Raghu Rama Krishna Raju)కు సిట్ నోటీసులు పంపడం అందరిని అశ్చర్యానికి గురిచేస్తుంది.

ఆయన ఏపీ కి సంబంధించిన నాయకుడు.. మళ్లీ బీజేపీ లీడర్ కూడా కాదు. ఆయనకు సిట్ ఎందుకు నోటీసులు పంపింది. ఈ కేసులో ర‌ఘురామ‌కృష్ణంరాజుకు నిజంగా సంబంధం ఉందా అన్నది అంతుచిక్కడం లేదు. అయితే నిప్పులేనిదే పొగ రాదుగా. ఏపీలో సొంత పార్టీ వైసీపీతో ర‌ఘురామ‌కు అస‌లు పొస‌గ‌డం లేదు. హైదరాబాద్ టు ఢిల్లీ చక్కర్లు కొడుతున్నారాయన. ఆయన సొంత నియోజకవర్గానికి ఎప్పుడెళ్లారో ఆయనకే తెలియాలి.

May be an image of 2 people and people sitting

 

ఇక సిట్ విచారణలో ర‌ఘురామ ప్రమేయం ఉంద‌ని తేలితే కేసీఆర్ ఆయనను ఏం చేస్తారన్నది మరో టాపిక్. కేంద్రంతోనే ఢీ అంటే ఢీ అంటున్నారు కేసీఆర్.. ఆయనకు ర‌ఘురామ‌ ఒక లెక్కకాదు. త‌న ప్రభుత్వాన్ని కూల‌దోసే కుట్రలో ర‌ఘురామ పాత్ర ఉంద‌ని తేలితే మాత్రం రఘురామకు ద‌బిడి దిబిడే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ కేసులో తనకు నోటీసులే అందలేదని రఘురామ చెప్తుండడం గమనార్హం.