weather forecast for hyderabad and telangana రాష్ట్రంలో కొద్ది రోజులుగా వర్ష బీభత్సం కొనసాగుతోంది. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో జోరుగా వానలు పడుతున్నాయి. గత రెండు మూడు రోజులుగా హైదరాబాద్ ను ముసురు కమ్మేసింది. రాత్రి, పగలు.. చినుకులు రాలుతూనే ఉన్నాయి.
ఇక ఇవాళ రాత్రి నుంచి రేపు సాయంత్రం వరకు హదరాబాద్ లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది.
హైదరాబాద్ లో వర్షం పడినప్పుడు రోడ్లపైకి రావడం ప్రాణాలతో చెలగాటం ఆడటమే. బైక్ మీద ఉన్నా, కారులో ఉన్నా.. ప్రాణాలతో ఇళ్లకు తిరిగి వెళ్తామని గ్యారంటీ లేదు.
అందుకే వాతావరణశాఖ చాలా స్ట్రిక్ట్ గా హెచ్చరికలు జారీ చేసింది.
రేపు సాయంత్రం వరకు జనం ఇళ్ల నుంచి బయటకు రాకపోవడమే మంచిదని చెప్పింది. మరీ.. అత్యవసరమైతే తప్ప.. ఇంటి గడప దాటొద్దని హెచ్చరించింది.
ఉత్తర మరియు దాని పరిసర మధ్య బంగళాఖాతంలో ఉన్న అవర్తన ప్రభావంతో ఈ రోజు వాయువ్య మరియు తూర్పు మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడింది.
దీని ప్రభావంతోనే ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయి. దీని ప్రభావం మరింత పెరగనుందని వాతావరణశాఖ(Weather forecast) తెలిపింది.
ఇవాళ, రేపు, ఎల్లుండి భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది.
Read Also:
- Bigg Boss 5 Telugu : ‘రవివర్మ గీచిన బొమ్మలా’.. నాగ్ నే ప్లాట్ చేసేసింది..!
- Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ లోకి బూతుల బ్యూటీ.. ఇక రోజు బీప్ వేసుకోవాల్సిందే..!
- Rashi Singh : తడిసిన బట్టలతో మెరిసిన అందాలు.. !
- Naina Ganguly ని ఇలా చూస్తే ఖతమే..!
- అయ్యా జగన్.. వినాయకచవితి వేడుకల పై ఎందుకీ వివక్ష?
- Chiranjeevi – pawan Kalyan : ఇండస్ట్రీకి తోపులు.. చేసేవేమో రీమేక్ లు…!