Vijayashanthi :  ఈ ధర్నా దేనికి.. KCRకి రాములమ్మ సూటిగా 18 ప్రశ్నలు..!
Latest News Telangana

Vijayashanthi : ఈ ధర్నా దేనికి.. KCRకి రాములమ్మ సూటిగా 18 ప్రశ్నలు..!

Vijayashanthi : దాన్యం సేకరణ పై కేంద్రం వైఖరికి నిరసనగా అధికార టీఆర్ఎస్ పార్టీ నేడు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు నిర్వహించనుంది. సీఏం కేసీఆర్ పిలిపు మేరకు దర్నాల కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ ధర్నా దేనికి అంటూ బీజేపీ నాయకురాలు విజయశాంతి(Vijayashanthi ) కేసీఆర్ కి  సూటిగా 18 ప్రశ్నలు వేశారు.

1) సన్నపు వడ్లకు రూ.150 ఎక్కువ ఇస్తామని ఇవ్వనందుకా?
2) ఉచిత ఎరువులు ఇస్తామని ఇయ్యనందుకా?
3) క్రాఫ్ లోన్ పైన వడ్డీ రాయితీ ఇయ్యనందుకా?
4) 1 లక్ష రుణమాఫీ చేయనందుకా?
5) డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వనందుకా?
6) బలవంతంగా దొడ్డు రకం దొరకకుండా చేసి సన్నవడ్లు వేయించినందుకా?
7) నాబార్డ్ రుణాలపైన వడ్డీ రాయితీ ఎత్తేసినందుకా?
8 )  రైతుల పేరు చెప్పి కార్యకర్తలకు ట్రాక్టర్లు ఇచ్చినందుకా ?
9) రాష్ట్రం సహకారంతో పసుపుకు మద్దతు ధర ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న కేంద్రానికి లేఖ రాయనందుకా?
10) ట్రాక్టర్ యంత్రాలపైన సబ్సిడీ ఎత్తేసినందుకా?
11) భూ పరీక్షలు చేయనందుకా?
12) పంట నష్టానికి పరిహారం ఇవ్వనందుకా?
13) ఫసల్ భీమా అమలు చేయకుండా రైతులను వరదల్లో ముంచినందుకా?
14) చెరుకు ఫ్యాక్టరీలు మూయించినందుకా?
15) మక్కలు కొనకుండా మోసం చేసినందుకా?
16) పసుపు, అల్లం కొమ్ము ఐకేపీ ధ్వారా కొననందుకా?
17) వరి పంట వేస్తే ఉరేనని అన్నందుకా ?
18) పారాబాయిల్డ్ రైస్ మాత్రమే కొనం.. అని కేంద్రం క్లియర్‌గా చెప్పినంక కూడా… మిల్లర్ల కోసం, వాళ్లిచ్చే కమీషన్‌ల కోసం రాద్ధాంతం చేస్తున్నందుకా…?

 

Also Read :