దళితబంధు : హుజూరాబాద్‌‌కి మరో రూ. 500 కోట్లు.. !
Latest News Telangana

దళితబంధు : హుజూరాబాద్‌‌కి మరో రూ. 500 కోట్లు.. !

దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయబడుతున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి మరో రూ. 500 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. హుజూరాబాద్ సభ అనంతరం పైలట్ ప్రాజెక్టు అమలు కోసం మొత్తం రూ.2000 కోట్ల నిధులు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ గతంలోనే ఆదేశాలు జారీ చేశారు.

మొదటి విడతలో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన రూ.500 కోట్లతో పాటు ఇప్పుడు విడుదల చేసిన రూ.500 కోట్లు కలిపి హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పైలట్ ప్రాజెక్టుకు గాను మొత్తం రూ. 1000 కోట్ల నిధులు విడుదలయ్యాయి. కాగా.. వారం రోజుల్లోపు మరో రూ. 1000 కోట్లు ప్రభుత్వం విడుదల చేయనున్నది. దాంతో సీఎం ప్రకటించిన రూ. 2000 కోట్ల నిధులు పూర్తి స్థాయిలో విడుదల కానున్నాయి.

Also Read :