Telangana : ‘ఒక నాగలి, రెండు ఎడ్లు’.. ఏమైందయ్యా రఘునందనా..!
Latest News Telangana

Telangana : ‘ఒక నాగలి, రెండు ఎడ్లు’.. ఏమైందయ్యా రఘునందనా..!

Telangana : హుజురాబాద్ బై ఎలక్షన్‌‌తో తెలంగాణ(Telangana) రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ టీఆర్ఎస్ పైన, కేసీఆర్ విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. దళిత, గిరిజన దండోరాలతో కాంగ్రెస్ నేతలు గట్టిగా కౌంటర్‌‌లు వేస్తుంటే… పాదయాత్రలతో బీజేపీ నేతలు గరంగరం అవుతున్నారు.

దీనితో టీఆర్ఎస్ నేతలు కూడా అలెర్ట్ అయ్యారు. మాటకి మాట బదులు ఇస్తున్నారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డిలను టార్గెట్ చేస్తూ మంత్రి కేటీఆర్ ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు కేటీఆర్ బాటలోనే ఆ పార్టీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కూడా ప్రతిపక్షాలను ఏకీ పారేసే పని పెట్టుకున్నారు.

అందులో భాగంగా దుబ్బాక ఎమ్మెల్యే, బీజేపీ నేత రఘునందన్ రావుని గట్టిగానే అర్సుకున్నారు.దుబ్బాక ఉప ఎన్నికల వేళ ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘునందన్ రావు రైతన్నలకి ఇచ్చిన హామీని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారాయన.

బీజేపీ అభ్యర్ధి అయిన తనని గెలిపిస్తే ప్రతి రైతు కుటుంబానికి ఒక నాగలి, రెండు ఎద్దులు ఇస్తామని అప్పట్లో హామీ ఇచ్చిన రఘునందన్ రావు వీడియోని ఆయన ట్వీట్ చేస్తూ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.

కేవలం వెయ్యి ఓట్ల మెజారిటీ కోసం వెయ్యి అబద్ధాలు చెప్పారని దొంగ హామీలు బయటపడ్డాయని ఎద్దేవా చేశారు.

Also Read :