Revanth Reddy : రాజకీయాల్లో హుందాతనం అనేది చాలా ముఖ్యం.. మరి ముఖ్యంగా కీలకమైన పదవుల్లో ఉన్నవారికి ఇది మరింత అవసరం.. ఎంత హుందాగా ప్రవరిస్తే బయట అంతమంచి పేరు ఉంటుంది. ఏ మాత్రం తేడా వచ్చినా రాజకీయంగానే(Revanth Reddy) కాకుండా వ్యక్తిగతంగాను చెడ్డ పేరు వస్తుంది.
నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు కావడంతో టీఆర్ఎస్ నేతలతో పాటుగా ప్రధాని మోదీ, పలువురు తెలంగాణ బీజేపీ నేతలు, పక్క రాష్ట్రాల సీఎంలు ఆయనకీ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేసి తమ హుందాతనాన్ని చాటుకున్నారు. కానీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం చాలా చీప్ గా ప్రవర్తించారని టీఆర్ఎస్ కార్యకర్తలు అంటున్నారు.
కేసీఆర్ పుట్టినరోజుపై రేవంత్ రెడ్డి ట్విట్టర్లో వ్యంగ్యంగా స్పందించారు. ఊసరవెల్లి ఫోటోతో పుట్టినరోజు శుభాకాంక్షలు అని పోస్టు చేశారు. కేసీఆర్ ని టార్గెట్ చేసి రేవంత్ ఈ పోస్ట్ పెట్టారని టీఆర్ఎస్ కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు.
జన్మదిన శుభాకాంక్షలు… pic.twitter.com/RaVDwU0zZw
— Revanth Reddy (@revanth_anumula) February 17, 2022
రాజకీయాల్లో విమర్శలు సర్వసాధారణమే.. కానీ వాటిని వ్యక్తిగతంగా తీసుకోకూడదు. రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్న ఓ నాయకుడి పుట్టిన రోజు నాడు మరీ ఇంత దారుణంగా మాట్లాడుడు పద్ధతేనా? బండికి ఉన్న ఇంగిత జ్ఞానం నీకు లేకపాయె రేవంత్ అని చురకులు అంటిస్తున్నారు.
ఓ ప్రతిపక్ష నేతగా శుభాకాంక్షలు తెలియజేయాలి అంటే మనస్పూర్తిగా తెలియజేయండి లేదంటే వదిలేయండి.. కానీ ఇలా వెటకారంగా మాత్రం వద్దని తెలుపుతున్నారు. తోటి నాయకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేని నువ్వు రాజకీయాలకి అనవసరం అని సోషల్ మీడియాలో దుమ్ముదులుపుతున్నారు. నీలాంటి వాడికి టీపీసీసీ చీఫ్ పోస్ట్ ఇచ్చినందుకు కాంగ్రెస్ పరువు తీస్తున్నావ్ అంటూ కామెంట్స్ వదులుతున్నారు.
అటు నెటిజన్లు కూడా రేవంత్ పై ఫైర్ అవుతున్నారు.. ఇలాంటివి మీ నుంచి ఆశించడం లేదు రేవంత్.. మీరో బాధ్యతాయుతమైన పోస్ట్ లో ఉన్నారు ఆ విషయం గుర్తించుకోండి.. ఇలా చీప్ గా బిహేవ్ చేస్తే మీకు మీ పార్టీ కార్యకర్తకి పెద్ద తేడా ఏముందని ప్రశ్నిస్తున్నారు.
Also Read :
- Anasuya Bharadwaj : హాట్ హాట్ గా అనసూయ..!
- Goutam Sawang : గౌతమ్ సవాంగ్‌కు సీఏం జగన్ కీలక పదవి..!
- Sravanthi Chokarapu : గోవాలో టీవి యాంకర్ రచ్చ..!