Prashant Kishor : పబ్లిక్ తో పీకే టీమ్ సర్వే…పరేషాన్ లో మంత్రి అల్లోల
Latest News Telangana

Prashant Kishor : పబ్లిక్ తో పీకే టీమ్ సర్వే…పరేషాన్ లో మంత్రి అల్లోల

పబ్లిక్ తో పీకే టీమ్ సర్వే…పరేషాన్ లో మంత్రి అల్లోల
(ఫోటో : మంత్రి ఐకే రెడ్డి మధ్యలో పీకే ఏలేటి మహేశ్వర్ రెడ్డి )

Prashant Kishor :ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలలో పీకే టీమ్‌ సర్వే సరికొత్త రాజకీయ చర్చకు దారితీస్తోంది. రెండు వారాల పాటు మండలాలవారీగా జరిపిన సర్వేలో విస్తుపోయే విషయాలను గుర్తించింది సర్వేటీమ్. గులాబీ బాస్ కు స్పష్టమైన నివేదికను ఇవ్వడంతో అప్పుడే గులాబీ లీడర్లలో గుబుులు మొదలైంది. 15 రోజుల పాటు రెండు సర్వే బృందాలు అన్ని వర్గాల నుంచి ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక ప్రభావంపై ఒపినియన్ తీసుకుని రిపోర్ట్ చేశాయి. ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వ పథకాలు అమలు తీరు, ఇంకా ఎలాంటి పథకాలు తీసుకొస్తే బాగుంటుంది, మీ కుటుంబంలో ఎంత మంది సంక్షేమ పథకాల లబ్దిదారులున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరు, అవినీతి ఆరోపణలు, ప్రజా వ్యతరేకత, కుటుంబ సభ్యుల ఆగడాలపై కీలక సమాచారం రాబట్టింది పీకే(Prashant Kishor) టీమ్. దీంతో పాటు ప్రధాన ప్రత్యర్థిపార్టీ నాయకులు, గత ఎన్నికల్లో సమీపంగా ఉన్న అభ్యర్థులు, పబ్లిక్ లో వారికున్న ఫీడ్ బ్యాక్, వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎమ్మెల్యేగా ఉండాలని ప్రజలు ఎక్కువగా కోరుకుంటున్నారు..ఇలా అన్ని కోణాల్లోనూ ప్రశాంత్ కిషోర్ సర్వే బృందం సమాచారం సేకరించింది.

ఈ నేపథ్యంలో సర్వే ఫీడ్ బ్యాక్ ఆధారంగానే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు ఉంటుందనే ప్రచారం ఉండటంతో ఉమ్మడి జిల్లాలో మంత్రిగా ఉన్న అల్లోలలో అప్పుడే ఆందోళన మొదలైనట్లు కనిపిస్తోందట, సర్వే ఫీడ్ బ్యాక్ పై పరేషాన్ లో ఉన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సర్వే వారు ఏం ప్రశ్నలు అడిగారు, పబ్లిక్ ఏం సమాధానం చెప్పారు, అవినీతి ఆరోపణలపై పబ్లిక్ రియాక్షన్ ఏంటనే విషయాలపై తన సన్నిహితులతో ఆరాతీస్తున్నాడట, పీకే సర్వేలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై నియోజకవర్గ ప్రజలతో పాటు సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తం అయినట్లు తెలుస్తోంది. ముందునుంచి ఉన్న టీఆర్ఎస్ నేతలను పట్టించుకోకపోవడం, అమరవీరుల కుటుంబాలను విస్మరించడం, తన సొంత కుటుంబీకులకే కాంట్రాక్టులు, కమీషన్లు కట్టబెట్టడం వంటి విషయాలపై సొంత పార్టీ నేతలే సర్వే బృందానికి సమాచారం అందించారట.

దీంతో వచ్చే ఎన్నికల్లో నిర్మల్ లో రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయనేది దానిపై ఇప్పటికే పొలిటికల్ సర్కిల్స్ లో చర్చలు మొదలయ్యాయి. పీకే సర్వే నేపథ్యంలో ఐకేరెడ్డిపై ఉన్న వ్యతిరేకత, తీవ్రత అధికంగా ఉండటం వలన ఇదీ ప్రధాన ప్రత్యర్థికి కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. మళ్లీ సిట్టింగ్ నే బరిలోకి నిలిపితే తీవ్ర ప్రజా వ్యతిరేకత ఐకే రెడ్డిగెలుపుపై ప్రభావం చూపుతుందని పీకే సర్వే రిపోర్ట్ లో తేల్చినట్లు తెలుస్తోంది. మంత్రి కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరగణం అవినీతి అక్రమాలు, కబ్జాలు, అరాచకాలు ఐకేరెడ్డికి వచ్చే ఎన్నికల్లో ఆటంకాలుగా మారే అవకాశం ఉందనే మాటతో పాటు ఇలా నియోజకవర్గంలోని అధికారపార్టీ ఎమ్మెల్యేతో పాటు ప్రధాన ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన అనుకూల, ప్రతికూల అంశాలపై సమగ్ర నివేదికను పార్టీ అధినేతకు ఇచ్చిందట ప్రశాంత్ కిషోర్ బృందం, ఇప్పటికే 54మంది ఎమ్మెల్యేల పనితీరుపై వ్యతిరేకమైన ఫీడ్ బ్యాక్ ను పార్టీ అధినేతకు అందజేసినట్లు తెలిసింది.

Also Read :