Munugodu JP Nadda : నడ్డాకు సమాధి కట్టిన్రు
Latest News Telangana

Munugodu JP Nadda : నడ్డాకు సమాధి కట్టిన్రు

Munugodu JP Nadda : మునుగోడులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(Munugodu JP Nadda )కు ఘోర అవమానం జరిగింది. చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురంలో గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఆయనకు సమాధి కట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

2016లో నడ్డా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో మునుగోడు నియోజకవర్గంలో పర్యటించారు. ఆ సమయంలో దండుమల్కాపురంలో ఫ్లోరైడ్‌ రిసెర్చ్‌ అండ్‌ మిటిగేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని హామీఇచ్చారు. దీనికి ప్రభుత్వం కూడా 8.2 ఎకరాల స్థలం కేటాయించింది.

కానీ హమీ ఇచ్చి ఏళ్లు దాటుతున్న దానికి కేంద్రం రూపాయి కూడా కేటాయించలేదు. . దీంతో ఆ స్థలం వృథాగా ఉండిపోయింది. ఇచ్చిన హమీని బీజేపీ ప్రభుత్వం నెరవేర్చకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తులు ఆ స్థలంలో సమాధి కట్టారు. సమాధి పక్కన జేపీ నడ్డా ఫొటోను పెట్టి పూలమాల వేసి.. పసుపు, కుంకుమ చల్లారు.

Also Read :