KCR : కేసీఆర్‌‌కు వరుస షాకులు..!
Latest News Telangana

KCR : కేసీఆర్‌‌కు వరుస షాకులు..!

KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌కు వరుస షాకులు తగులుతున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రెండు మూడు సార్లు కోర్టులు కేసీఆర్(KCR ) సర్కారుకు షాకిచ్చాయి. ఇప్పుడు పరిపాలనా పరంగా కీలక స్థానం విషయంలో కోర్టులో ఎదురుదెబ్బలు తగిలాయి.

ప్రస్తుతం తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కొనసాగింపును హైకోర్టు రద్దు చేసింది. వాస్తవానికి రాష్ట్ర విభజన సమయంలో సోమేష్ కుమార్ ను ఏపీకి కేటాయించారు. కానీ ఆయన తెలంగాణ కేడర్ లో కొనసాగుతున్నారు. దీనిపై చాలా కాలంగా వివాదం నడుస్తోంది.

క్యాట్ ఉత్తర్వులు కొట్టేయాలని 2017లో కేంద్రం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఇవాళ హైకోర్టు తుది ఉత్తర్వులు ఇచ్చింది. తెలంగాణలో కొనసాగిస్తూ గతంలో కేంద్ర పరిపాలన ట్రిట్యునల్(CAT) ఇచ్చిన ఉత్తర్వులను సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బెంచ్ తీర్పు ఇచ్చింది.

అయితే.. ఇప్పుడే సోమేష్ కుమార్ పదవి నుంచి దిగిపోయే ఛాన్స్ లేదు. తీర్పు అమలును మూడు వారాల పాటు నిలుపుదల చేయాలని సోమేష్ కుమార్ న్యాయవాది అభ్యర్థించారు. దీనికి కోర్టు అంగీకరించింది. అయితే.. ఈ మధ్య కాలంలో హైకోర్టులో తెలంగాణ సర్కారుకు తగులుతున్న వరుస ఎదురుదెబ్బలు సంచలనంగా మారాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులు రెడ్ హ్యాండెడ్ గా దొరికినా కోర్టులు మాత్రం సర్కారుకు వ్యతిరేకంగానే ఆదేశాలిచ్చాయి.

నిందితుల కస్టడీకి మొదట కోర్టు అంగీకరించలేదు. బీఎల్ సంతోష్ ను విచారించేందుకు అనుమతి రద్దు చేశాయి. సిట్ ను రద్దు చేశాయి. సిట్ సరిగా పనిచేయడం లేదంటూ విమర్శలు చేశాయి. ఇలా వరుస ఘటనలు జరుగుతున్న టైంలోనే సీఎస్ సోమేష్ కుమార్ కు సంబంధించి వచ్చిన తీర్పు బీఆర్ఎస్ పెద్దలను పరేషాన్ చేస్తోంది.

Also Read :