Telangana : కేసీఆర్ మరో స్కీమ్… 47 ఏళ్ళు నిండిన రైతులకు పింఛన్.. !
Latest News Telangana

Telangana : కేసీఆర్ మరో స్కీమ్… 47 ఏళ్ళు నిండిన రైతులకు పింఛన్.. !

Telangana : రాష్ట్రంలోని రైతుల కోసం ఇప్పటికే తెలంగాణ(Telangana ) ప్రభుత్వం రైతుబంధు, రైతుభీమా పధకాలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రైతుల కోసం మరో పధకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర సర్కార్ సిద్దమైంది. 47ఏళ్ళు నిండిన రైతులకి పింఛన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.

వచ్చే బడ్జెట్‌‌‌లో ఈ స్కీమ్‌‌ని ప్రవేశపెట్టనున్నారు. 47 ఏళ్ళు నిండిన చిన్న సన్నకారు రైతులకి రూ.  2,106 ఇచ్చే ఆలోచనలో కేసీఆర్ సర్కార్ ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో రైతుబంధు పొందుతున్న రైతులు 67 లక్షలకి పైనే ఉన్నారు. వీరిలో 47ఏళ్ళు నిండిన వారు ఎంతమంది ఉన్నారు? ఈ స్కీం విధివిధానాలు, సాధ్యాసాధ్యాల పైన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఎక్సర్సైజులు మొదలుపెట్టింది.

ప్రస్తుతం రాష్ట్రములో గుంట భూమి ఉన్న సరే రైతుబంధు అందుకుంటున్నారు రైతులు. కానీ రైతు పింఛన్ విషయంలో కండిషన్స్ ఉంటాయని అధికారులు అంటున్నారు. మూడెకరాల నుంచి అయిదు ఎకరాల వరకు ఉన్న రైతులకి మాత్రమే రైతు పింఛన్ ఇచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

వచ్చే బడ్జెట్ నాటికి దీనికి సంబంధించిన సమగ్ర సర్వే పూర్తి చేయాలనీ అధికారులు ఆదేశించారు సీఏం కేసీఆర్. సాధ్యమైనంత వరకు ఎక్కువమందికి ఈ స్కీమ్ ద్వారా లబ్ది చేకూరాలని అధికారులకి సీఏం ఆదేశించారు.

Also Read :