Telangana Government : ఫెయిల్‌ అయిననోళ్ళను పాస్‌ చేస్తున్నం : సబితా
Latest Telangana

Telangana Government : ఫెయిల్‌ అయిననోళ్ళను పాస్‌ చేస్తున్నం : సబితా

Telangana Government : ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు గుడ్‌ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్‌ (Telangana Government ). ఫెయిల్‌ అయిన విద్యార్థులందరిని మినిమమ్‌ మార్కులతో పాస్‌ చేస్తున్నట్లు ప్రకటించారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

మానావత దృక్పథంతో సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ధర్నాలు చేస్తే పాస్‌ చేస్తారనుకోవడం సరికాదన్నారు. ఇంటర్ సెకండియర్‌ పరీక్షల కోసం మంచిగా ప్రిపేర్‌ కావాలని సూచించారు.

విద్యార్థులు ఫెయిల్ కావడానికి బోర్డు తప్పిదమే కారణమనడం సరికాదన్నారు. విద్యార్థులకు అన్ని విధాలా సౌకర్యాలు కల్పించామన్నారు. 70 శాతం సిలబస్‌తోనే విద్యార్థులకు ఎగ్జామ్ పెట్టినట్లు గుర్తు చేశారు.

Also Read :