Telangana congress : ఫస్ట్ అటెంప్ట్ లోనే రేవంత్ ఫెయిల్.. దుమ్ముదులుపుతున్న సీనియర్లు..!
Latest News Telangana

Telangana congress : ఫస్ట్ అటెంప్ట్ లోనే రేవంత్ ఫెయిల్.. దుమ్ముదులుపుతున్న సీనియర్లు..!

Telangana congress : ఉత్కంఠభరితంగా సాగుతున్న బై పోల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి ఈటెల రాజేందర్ భారీ మెజారిటీ దిశగా కొనసాగుతున్నారు. ఆ తరవాత స్థానంలో టీఆర్ఎస్, కాంగ్రెస్(Telangana congress ) ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీకి అత్యంత తక్కువ ఓట్లు వచ్చాయి. ఓట్ల లెక్కింపు అయితే అయిపోయేసరికి కాంగ్రెస్ డిపాజిట్‌ కోల్పోయే పరిస్థితి అక్కడ కనిపిస్తోంది.

ఈ క్రమంలో పార్టీ సీనియర్ లీడర్లు టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి పైన ఫైర్ అవుతున్నారు. బీజేపీ గెలుపు కోసమే రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారని, బల్మూర్‌ వెంకట్‌ని బలిపశువును చేశారని అంటున్నారు. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ‘‘హుజూరాబాద్‌ ఎన్నికలను ఎవరూ పట్టించుకోలేదు. క్యాడర్‌ ఉన్నా ఓటు వేయించుకోలేకపోయాము. వాస్తవ పరిస్థితిని హైకమాండ్‌కు తెలియజేస్తాను’’ అన్నారు.

అటు జగ్గారెడ్డి మాట్లాడుతూ.. హుజూరాబాద్‌లో బల్మూర్‌ వెంకట్‌ని రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క బలి పశువును చేశారు. బహిరంగ సభలతో ప్రయోజనం ఉండబోదని మరో సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు. కాగా టీపీసీసీ చీఫ్‌ బాధ్యతలు చేపట్టిన తరవాత రేవంత్ ఎదురుకున్న తొలి ఎన్నిక ఇదే కావడం విశేషం.

Also Read :