KCR Press Meet : మెడలు వంచుతా అన్నోనికి మెడ మీద తలకాయ లేదని అర్ధమైంది..!
Latest News Telangana

KCR Press Meet : మెడలు వంచుతా అన్నోనికి మెడ మీద తలకాయ లేదని అర్ధమైంది..!

KCR Press Meet :

* బండి సంజయ్ వడ్ల విషయం తప్పా మిగతా సొల్లు పురాణం అంత మాట్లాడాడు.
* రైతుల సమస్యల మీద రైతులు అక్కడ దాదాపు సంవత్సరం కాలం నుండి పోరాటాలు చేస్తున్నారు.
* గట్టిగా మాట్లాడితే దేశ ద్రోహి అంటున్నారు. మేము రాష్ట్రపతి ఎన్నికలకు సపోర్ట్ చేసినప్పుడు,బిల్లు లకు సపోర్ట్ చేసినప్పుడు కనపడలేదా.
*బీజేపీ ఏమైనా దేశద్రోహం యాక్ట్ తయారు చేసే కంపెనీనా.
*బీజేపీ వాళ్ళు రెండు స్టాంప్ లు తయారు చేసుకున్నారు…. బీజేపీ వాళ్ళు ఒకటి దేశ ద్రోహం, రెండు అర్బన్ నక్సలైట్.గట్టిగా మాట్లాడితే దేశ ద్రోహులు అంటున్నారు.
* రైతుల గురించి మాట్లాడిన మేఘాలయ గవర్నర్, బీజేపీ ఎంపీ లు దేశ ద్రోహులా.
* దేశం దురాక్రమణ జరుగుతుందని కాపాడండని చెప్పడం దేశ ద్రోహమా.
* కేసీఆర్ పైసలు చైనా లో ఎందుకు దాచుకుంటారు.
* పంజాబ్ లో కొన్నట్టు ఇక్కడ కూడా తెలంగాణ లో పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలి.
* తెలంగాణ లో పండించిన ప్రతి గింజను కొంటారా కొనరా.. మీరు సమాధానం చెప్పే వరకు మేము వదలము.
* దేశ ప్రజలు బాగుండాలని కోరుకుంటాను.రాయలసీమ బాగుండాలని చెప్పాను…రాయలసీమ కరువు ప్రాంతం అని ఆ మాట చెప్పాను.
*కేంద్రం లో అధికారంలో ఉన్న పార్టీలు తమిళనాడు, కర్ణాటక లో ఎన్నికలు ఉన్న ప్రతి సారి కావేరి నది జలాల వివాదం ను తీసుకు వస్తారు.
* పక్క రాష్ట్రం పోయి చేపల పులుసు తింటే తప్పా..
* విషయం లేని వాళ్ళు సబ్జెక్ట్ లేని వాళ్ళు కిరి కిరి గాళ్ళు వ్యక్తిగత దూషణలు చేస్తారు.
*రాష్ట్రంలో పండే వరి ధాన్యం ను కొనుగోలు చేస్తుందా లేదా దానికి సమాధానం చెప్పు…పారిపోకు
*62 లక్షల ఎకరాల్లో వరి ఉన్నది నేను చూపిస్తాను రా. 6 హెలికాఫ్టర్ పెట్టి చూపిస్తాను మీరు మీ కేంద్ర ప్రభుత్వం రండి.
*ఢిల్లీ లో నుండి కేంద్ర మంత్రులు ఫోన్ చేసి పిచ్చి మాటలు మాట్లాడకు అని చెప్పే సరికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వరి విషయం తప్పా మిగతా విషయాలు మాట్లాడారు.
* తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఎక్కడ అని అంటున్నావ్..నువ్వు ఎక్కడ ఉన్నావ్.
* వీళ్ళ కథ తేల్చే వరకు నినే మాట్లాడుతాను.
* నేను తెలంగాణ కాపాలదారుడ్ని..
ప్రతి ఇంటికి ఎదో ఒక సంక్షేమ పథకం అందుతుంది.నీ ఇంటికి కూడా మిషన్ భగీరథ వాటర్ వస్తున్నాయి కదా…
* నిసిగ్గుగా మాట్లాడుతున్నావ్.గొర్ల పైసలలో కేంద్రం పైసలు ఒక్క రూపాయి ఉన్న నేను రాజీనామా చేస్తాను. ncdc లో మేము అప్పు తీసుకుంటున్నాము వడ్డీ తో సహా రూపాయి కూడా చెల్లిస్తున్నాము.
* బీజేపీ పాలిత ప్రాంతాల్లో మా పథకాలు ఒక్కటి అమలు చేయడం లేదు.
* దొడ్డి దారిన మధ్యప్రదేశ్,కర్ణాటక ప్రభుత్వాలను గుంజు కోలేదు.

తెలంగాణకు ఏం చేసినవో చెప్పమంటున్నాడు ఈ మొగోడు..
సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయి
గొర్ల పైసలు ఇచ్చామంటున్నారు.. నిరూపిస్తావా?
గొర్ల పైసలు మీరిచ్చారని తేలితే నిమిషంలో సీఎం పదవికి రాజీనామా చేస్తా
ఉచితాలతో ప్రజల్ని సోమరిపోతుల్ని చేస్తున్నారని అంటున్నారు..
మేం ప్రజల్ని సోమరిపోతుల్ని చేస్తున్నామా?

మీరు లొంగి ఉండి.. చెప్పింది వింటే దేశభక్తులు..
మీరు చెప్పింది ఒప్పుకోకుంటే దేశద్రోహులు
ఈడీ, ఇన్‌కం ట్యాక్స్‌ రైడ్స్‌ బీజేపీ స్టైల్‌
బండి సంజయ్‌ ఒళ్లు దగ్గర పెట్టుకో జాగ్రత్త
మీ పిట్ట బెదిరింపులకు భయపడిపోం
దళిత సీఎంను చేయలేదు.. మళ్లీ ఎన్నికలకు వెళ్లాం కదా..
దళిత సీఎంను చేయకపోవడానికి చాలా కారణాలున్నాయి
అడ్రస్‌ లేంది మీ పార్టీకి.. మా పార్టీకి కాదు
జీహెచ్‌ఎంసీలో మాకన్నా ఎక్కువ స్థానాలు గెలిచారా?
2001 నుంచి ఎన్నో ఎన్నికల్లో గెలిచాం
నేను ఎన్ని రాజీనామాలు చేశాను.. ఎక్కడెక్కడి నుంచి గెలిచానో తెలుసా?
తెలంగాణ బిల్లులో నేను ఓటు వేయలేదంటున్నారు..
అసలు అప్పుడు నీకు పార్లమెంట్‌ తెలుసా?
దేశంలో మీరు ఏ వర్గం ప్రజలకు మేలు చేశారు?

కేబినెట్‌లో ఎందుకు ఉద్యమకారులున్నారంటున్నారు..
కేబినెట్‌లో అందరూ ఉద్యమకారులే ఉంటారా?
ఇతర పార్టీల నుంచి తీసుకుంటే తప్పేంటి?
మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాధిత్య సింథియాను తీసుకొని పదవి ఇవ్వలేదా?
రెండు సీట్లు గెలిచినంత మాత్రాన అహంకారం పనికిరాదు
మేం సేవ చేశాం.. మమ్మల్ని ప్రతివారూ ఆదరిస్తారు
కేంద్రం వడ్లు కొనాలని వచ్చే శుక్రవారం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా చేస్తాం
వడ్ల మాట మాట్లాడడం లేదు.. దేశద్రోహి మాట మాట్లాడుతున్నారు…