Telangana Bjp : సింగిల్ ఫొటోతోని సిగ్గంత పాయే..!
Latest Telangana

Telangana Bjp : సింగిల్ ఫొటోతోని సిగ్గంత పాయే..!

Telangana Bjp rythu deeksha : తెలంగాణలో పట్టు సాధించేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. టీఆర్ఎస్ కు కౌంటర్ గా కార్యక్రమాలు చేస్తోంది. ధాన్యం కొనుగోలుపై రాష్ట్రంలో రాజకీయాలు హీటెక్కాయి. నెల రోజులుగా కేంద్రం వర్సెస్ రాష్ట్ర సర్కారు యుద్ధం నడుస్తోంది.

ఇప్పటికే రెండు సార్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేసిన టీఆర్ఎస్ ఇవాళ(ఏప్రిల్ 11,2022) ఢిల్లీలో వరిదీక్ష చేపట్టింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. కేంద్రమే వడ్లు కొనాలనే డిమాండ్ తో ఈ దీక్ష చేపట్టింది రాష్ట్ర సర్కారు.

Read Also :

అయితే.. టీఆర్ఎస్ కు పోటీగా ఇవాళ హైదరాబాద్ లో దీక్ష చేపట్టింది బీజేపీ. రాష్ట్ర ప్రభుత్వమే వడ్లు  కొనాలంటూ రైతు దీక్ష చేస్తోంది.

ఇక్కడో ఓ గమ్మత్తు జరిగింది. బీజేపీ రైతు దీక్ష కోసం ఫ్లెక్సీలు పెట్టారు. అయితే.. ఓ ఫ్లెక్సీలు బండి సంజయ్ ఫొటోతో పాటు.. గోదుమలల ఫొటో పెట్టారు. వాస్తవానికి రాష్ట్రంలో ధాన్యం మొత్తం సర్కారే కొనాలనే డిమాండ్ తో బీజేపీ దీక్ష చేస్తోంది.

కానీ ఫ్లెక్సీలో మాత్రం గోధుమల ఫొటో పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో బీజేపీని చెడుగుడు ఆడుకుంటున్నారు. వడ్లకు, గోధుమలకు తేడా తెలియకుండా దీక్ష చేస్తున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు.

నిజానికి తెలంగాణలో గోధుమలు పండవు. కానీ బీజేపీ వాళ్లు గోధుమల ఫొటోతో దీక్ష చేయడంతో నెటిజన్లు వాయించి వదిలేస్తున్నారు. ధాన్యం కొనుగోలు మీద బీజేపీకి ఏమాత్రం ఆసక్తి లేదంటున్నారు. రాష్ట్ర రైతుల గురించి పట్టింపు లేదు కాబట్టే.. ఇలా గోధుమల ఫొటోతో దీక్షచేపట్టారని విమర్శిస్తున్నారు.

నోటికొచ్చినట్టు మాట్లాడటం కాదు.. అధికార పార్టీకి కౌంటర్ గా ప్రోగ్రాం పెడుతున్నప్పుడు కాస్త చూసుకోవాలి కదా అంటూ బీజేపీకి చురకలంటిస్తున్నారు.

Read Also :