Teenmar mallanna custody : బెదిరింపుల కేసులో అరెస్టైన తీన్మార్ మల్లన్నకు ఇప్పట్లో బెయిల్ వచ్చేలా లేదు. శుక్రవారం రోజు వేసిన బెయిల్ పిటిషన్ ను కోర్టు రిజెక్ట్ చేసింది. పోలీసు కస్టడీకి ఇవ్వొద్దన్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ లాయర్ల వాదనను కోర్టు తోసిపుచ్చింది.
చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న(Teenmar mallanna) అరెస్టైన మరుసటి రోజు పోలీసులు కస్టడీ కోరారు. అప్పుడు కోర్టు రిజెక్ట్ చేసింది. దీంతో ఖచ్చితంగా ఆయనకు బెయిల్ వస్తుందని లాయర్లు ధీమాగా చెప్పారు. త్వరలోనే ఆయన బయటకు వస్తారని అన్నారు.
కానీ అలా జరగడం లేదు. రోజు రోజుకి కేసు సీరియస్ అవుతోంది. తీన్మార్ మల్లన్నకు నాలుగు రోజుల పాటు పోలీసు కస్టడీకి(custody) కోర్టు అనుమతించింది. నాలుగు రోజులు ఆయనను పోలీసులు ప్రశ్నించనున్నారు.
అయితే.. ఇది ఈ నాలుగు రోజులతో ముగిసే అవకాశాలు తక్కువే.
ఎందుకంటే.. ఇప్పుడు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్(Teenmar mallanna) పై బెదిరింపులతో పాటు.. ఫేక్ సిమ్ కార్డులు వాడిన కేసు కూడా బుక్ అయినట్టు తెలుస్తోంది. జ్యోతిష్యుడు లక్ష్మికాంత శర్మను బెదిరించిన కేసులో.. ఫేక్ ఐడీ ప్రూఫ్ లతో తీసుకొచ్చిన కొన్ని సిమ్ కార్డులు వాడినట్టు పోలీసు విచారణలో తెలిసిందట.
ఇంకేముంది.. కేసు మొత్తం సిమ్ కార్డుల వైపు తిరిగింది. సిమ్ కార్డులు ఎక్కడ తెచ్చారు..? ఎవరు తెచ్చారు..? ఎందుకు తెచ్చారు..? ఈ సిమ్ కార్డులతో ఇంకా ఎవరినైనా బెదిరించారా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారట.
అంతేకాదు.. ఫేక్ అడ్రస్ ప్రూఫ్ లతో మొత్తం ఎన్ని సిమ్ కార్డులు తెచ్చారు. అవి ఎవరెవరి దగ్గర ఉన్నాయి. వాటిని దేనికోసం వాడారనే పూర్తి వివరాలు ఆరా తీస్తున్నారట పోలీసులు.
బెదిరింపుల కేసు.. చాలా చిన్నదే. ఇందులోంచి ఈజీగా మల్లన్న బయట పడొచ్చు. కానీ ఫేక్ సిమ్ కార్డులది చాలా పెద్ద కేసు. ఉగ్రకార్యకలాపాలు పెరిగిన నేపథ్యంలో ఫేక్ అడ్రస్ ప్రూఫ్ లతో సిమ్ కార్డులు వాడకుండా కేంద్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది.
అయినా.. జర్నలిస్ట్ గా చెప్పుకుంటున్న పొలిటీషియన్ తీన్మార్ మల్లన్న సిమ్ కార్డులు ఎలా తెప్పించారు..? దీని వెనకాల ఇంకా ఎవరున్నారే పూర్తి వివరాలు సేకరిస్తున్నారట పోలీసులు. తీన్మార్ మల్లన్న పోలీసు కస్టడీ పూర్తయ్యాక మరికొందరు అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయనే మాట వినిపిస్తోంది.
Read Also :
- Roja : సంపాదించింది మొత్తం అప్పులకే.. ఫైర్ బ్రాండ్ ఎమోషనల్..!
- Fidaa Sharanya : అచ్చ తెలంగాణ బ్యూటీ.. మన నిజామాబాద్ పిల్లే..
- KCR…. మంచోడే… కానీ…!
- HMTV యాంకర్ రోజా బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది?
- Ruhani Sharma : పిల్ల భలే దీని ఫిగరు భలే..!
- పెళ్లి తర్వాత మస్త్ కలరొచ్చిన సునీత..!
- Amazon Prime తీసుకుంటే వచ్చే లాభాలు ఇవే..!