Teenmaar Mallanna Arrested : Qన్యూస్ యూట్యూబ్ ఛానల్ ఓనర్.. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై వార్తలు వేయకుండా ఉండేందుకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడని.. లక్ష్మీకాంత శర్మ అనే జ్యోతిష్యుడు ఇచ్చిన ఫిర్యాదుతో తీన్మార్ మల్లన్నను(Teenmaar Mallanna ) అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ లని చిలకలగూడ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి.. స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం స్టేషన్లో మల్లన్నను విచారిస్తున్నారు.
అయితే.. లక్ష్మీకాంత శర్మ ఫిర్యాదులోనే అరెస్ట్ చేసినట్టు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నా.. ఇప్పుడప్పుడే మల్లన్న బయటకు వచ్చే అవకాశాలు లేవనే మాట వినిపిస్తోంది.
మల్లన్నపై ఇప్పటికే చాలా కేసులున్నాయి. ఇటీవల క్యూ న్యూస్ మాజీ బ్యూరో చీఫ్ చిలుక ప్రవీణ్ కుమార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ప్రైవసీకి భంగం కలిగించారంటూ ఓ యువతి కూడా మల్లన్నపై ఫిర్యాదు చేసింది.
తాజాగా టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ లు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎంను దూషించారని.. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
మల్లన్నపై గతంలో ఉన్న కేసులన్నీ ఇప్పుడు తెరపైకి వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు.
Read Also :
- ఏ.. పో అన్న నువ్వు.. ‘బండ్ల’ని మళ్ళీ కాటేస్తున్న ‘ఐడ్రీమ్’ నాగరాజా..!
- ‘బుల్లెట్టు బండి’ పాపకి బంపర్ ఆఫర్..!
- Khushbu Sundar : ఓ.. టూ లేట్.. మా ఆయన్ని అడిగి చెబుతా..!
- Actor kartikeya : వీళ్లిద్దరికి అక్కడ కుదిరిందట..! లక్కీ కార్తికేయ..
- V6 Teenmaar : తీన్మార్ రాధ ఎందుకు కనిపించడం లేదు..? ఏమైంది..?