Bathukamma Sarees : మీకెందుకమ్మా బతుకమ్మ చీరలు.. మల్లోపారి తీసుకోకుర్రి
Latest News Telangana

Bathukamma Sarees : మీకెందుకమ్మా బతుకమ్మ చీరలు.. మల్లోపారి తీసుకోకుర్రి

Bathukamma Sarees : బతకమ్మ అంటే తెలంగాణ, తెలంగాణ అంటేనే బతుకమ్మ. రాష్ట్రం ఏర్పడ్డ తరువాత కేసీఆర్ ప్రభుత్వం ఈ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించి చాలా గ్రాండ్ గా నిర్వహిస్తోంది. అందులో భాగంగా మతాలతో సంబంధం లేకుండా 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరికీ పండుగ కానుకగా బతుకమ్మ చీరను(Bathukamma Sarees) ప్రతీ ఏటా అందిస్తోంది. దీనికోసం ప్రభుత్వం ఏటా కొన్ని కోట్లు ఖర్చు పెడుతోంది. అలాంటి బతుకమ్మ చీరలను ఆడోళ్ళు అవమానపరుస్తుర్రు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొందరు మహిళలు బతుకమ్మ చీరలను స్టీల్ బోళ్లకు ఏసిర్రు. స్టీల్ బోళ్లకు అయితే పాత చీరలను ఎస్తరు.. కానీ వీళ్లు బతుకమ్మ చీరలను చీప్ గా భావించి స్టీల్ బోళ్లకు వేయడం అనేది బతకమ్మను, మగ్గం నేతన్నలను అవమానపరిచనట్లే అవుతోంది. కేసీఆర్ సర్కార్ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం వెనుక చాలా మంది నేతన్నలు బతుకుతుర్రు. ఉపాధి లేక సిరిసిల్లాలో చాలా మంది నేతన్నలు అత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఎన్నో జరిగినయ్. రాష్ట్రం ఏర్పడిన తరువాత అలాంటి గోసలు మళ్లీ చూడొద్దని వారికి ఆసరాగా ఉండేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చింది.

2022 సంవత్సరంలో 1.10 కోట్ల చీరల తయారీకి ప్రభుత్వం 333 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. 17 రంగులు, 17 డిజైన్లతో కలిపి మొత్తం 289 వర్ణాలతో చీరలను రూపొందించింది. చీరల తయారీకి సిరిసిల్లలోని 16 వేలమంది నేత కార్మికులకు పనులను అప్పగించింది. పండగప్పుడు మాకు రాలేందంటే మాకు రాలేదని ఎగవడి మరి ఈ చీరలను తీసుకునే ఆడోళ్ళు ఇప్పుడు వాటిని ఇట్ల స్టీల్ బోళ్లకు వేయడం అవమానపరచడం అవుతుంది. నిజంగా ఇది బాధకారమైన విషయమే. ఇలాంటోళ్లకు ప్రభుత్వం కూడా చీరలు ఇయోద్దు.. గీ చీరలు మేము కట్టుకుంటమా అనే ఫీలయ్యే ఆడోళ్ళు మల్లోపారి ఈ బతుకమ్మ చీరలను తీసుకోవద్దు.

Also Read :