MLA Poaching Case : చిత్రలేఖను 8 గంటలు విచారించిన సిట్
Latest News Telangana

MLA Poaching Case : చిత్రలేఖను 8 గంటలు విచారించిన సిట్

MLA Poaching Case :  టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక నిందితుడిగా ఉన్న నందకుమార్ భార్య చిత్రలేఖను సిట్ అధికారులు సుమారుగా 8 గంటలు విచారించారు. ఈ కేసులో(MLA Poaching Case) మరో ఇద్దరు నిందితులుగా ఉన్న సింహయాజీ, రామచంద్రభారతిలతో నందుకు ఉన్న సంబంధాల పై ఆమెను ఆరా తీశారు.

నందకుమార్‌ ఆర్థిక లావాదేవీలపై చిత్రలేఖను ప్రశ్నించారు. సోమవారం మరోసారి విచారణకు రావాలని అధికారులు ఆదేశించారు. ఇక ఈ కేసులో నోటీసులు అందుకున్న న్యాయవాది ప్రతాప్‌గౌడ్‌ ను కూడా సిట్ అధికారులు లోతుగా ప్రశ్నించారు.

మరోవైపు బీఎల్ సంతోష్ కు సిట్ జారీ చేసిన నోటీసులపై తెలంగాణ హైకోర్టు డిసెంబర్ 5 వరకు స్టే విధించింది. ఈనెల 26న లేదా 28న విచారణకు హాజరు కావాలని బీఎల్‌ సంతోష్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. అయితే ఆయన హైకోర్టును ఆశ్రయించారు. సిట్‌ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగానే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని , ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని సీఆర్‌పీసీ 41ఏ నోటీసు రద్దు చేయాలని కోర్టును కోరారు.

దీనిపైన విచారణ చేపట్టిన కోర్టు సిట్‌ జారీ చేసిన నోటీసుల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 5కి వాయిదా వేసింది.

Also Read :