TRS కొంపముంచుతున్న కలెక్టర్లు.. సీఏం సాబ్ ఏందీ కథ…!
Latest News Telangana

TRS కొంపముంచుతున్న కలెక్టర్లు.. సీఏం సాబ్ ఏందీ కథ…!

హుజురాబాద్ బై ఎలక్షన్‌‌‌ను ఇప్పడు టీఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. పేరుకే ఉపఎన్నిక కానీ.. మెయిన్ ఎలక్షన్ లాగా భావిస్తోంది.. ఎలాగైనా ఈటెలను ఓడగోట్టాలని ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది.. ఇప్పటికే దళితబంధు లాంటి స్కీమ్‌‌ని ముందే తీసుకొచ్చిన సీఏం కేసీఆర్ పైలెట్ ప్రాజెక్ట్‌‌‌గా దీనిని అక్కడ అమలు చేస్తున్నారు. వాస్తవానికి మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు ముందు ఈ ప్రాజెక్ట్‌‌ని రాష్ట్రమంతటా అమలు చేద్దామని అనుకున్నారు కేసీఆర్.

అక్కడ మేమే గెలుస్తామని కేసీఆర్‌‌తో పాటుగా మంత్రులు, ఎమ్మెల్యేలు కాన్ఫిడెంట్‌‌గా చెబుతున్నారు. అధికారంలో ఉండి హుజురాబాద్‌‌కి చేసినవి, గెలిస్తే మళ్ళీ ఏం చేస్తామో చెబుతున్నారు. ప్రజల్లో పార్టీని మరింత బలపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మరోపక్కా కలెక్టర్లు మాత్రం పార్టీ పరువును, ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నారు.

తాజాగా సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకటరామిరెడ్డి రెవెన్యూ, వ్యవసాయ అధికారులు, విత్తన డీలర్లతో నిన్న సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డైరెక్ట్ వేదిక పైన రైతులను, డీలర్లను బెదిరించారు. జిల్లాలో కిలో వరి విత్తనాలు అమ్మితే డైరెక్ట్ షాప్‌‌ని క్లోజ్ చేస్తామని, ఏ కోర్టులో కేసు వేసుకున్న, ఎవరితో ఫోన్ చేయించిన వదిలే సమస్యే లేదని వార్నింగ్ ఇచ్చారు. తాను కలెక్టర్‌‌గా ఉన్నంత కాలం ఆ షాపు క్లోజ్ గానే ఉంటుందని, ఇందులో నో డౌట్ అని అన్నారు.

వరి విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించవద్దని దానికి బదులుగా వేరుశనగ, పెసర, శనగ, నువ్వులు, సజ్జలు, ఇతర నూనె పంటలకు సంబంధించి నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలని డీలర్లను హెచ్చరించారు. ఈ విషయంలో తగ్గేదే..లే అనట్టుగా ఆయన మాట్లాడారు. ఇప్పుడు ఆయన మాట్లాడిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ప్రతిపక్షాలు దీనిపైన ఘాటుగా స్పందిస్తున్నాయి.

అటు జోగులాంబ జిల్లా కలెక్టర్ క్రాంతి చేసిన కామెంట్స్ కూడా హాట్ టాపిక్ గా మారాయి. కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోని వారి లిస్టు రెడీ చేసి వారికి రేషన్‌, పెన్షన్‌ ఆపేయాలని అధికారులను ఆదేశించినట్లు ఆమె తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో మంగళవారం పోస్టు చేశారు. ఇది కాస్త వివాదస్పదం అవ్వడంతో ట్వీట్ తొలిగించారు.

ఆ మధ్య సీఏం కేసీఆర్ కూడా.. వచ్చే యాసంగి నుంచి వరి పంట వేయడం అంటే రైతులు ఉరివేసుకోవడమే అని అన్నారు. కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారాన్ని లేపాయి. ఇప్పుడు కలెక్టర్లు కూడా అదే మాట మాట్లాడడంతో రైతులు ఆగ్రహంగా ఉన్నారు. మరి ఈ వ్యాఖ్యలు హుజురాబాద్ బై ఎలక్షన్‌ పైన ఏ మేరకు ప్రభావం చూపుతాయో చూడాలి.