Secret behind Revanth Reddy’s New party : తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త హాట్ టాపిక్ రెండు రోజులుగా హల్చల్ చేస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) కొత్త పార్టీ పెట్టబోతున్నారనే వార్త రాజకీయాలను కుదిపేస్తోంది.
రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెట్టబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం అంటూ.. ఓ జర్నలిస్ట్ ట్వీట్ చేయడం.. దానిపై కాంగ్రెస్(రేవంత్ వర్గం)నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇది మరింత ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లింది
ప్రముఖ ఛానళ్లలోనూ ఇదే వార్త బ్రేకింగ్ అయ్యింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే.. అక్కడ కూడా దీనిపై చర్చ జరిగింది. ఇలా రెండు రోజుల్లో ఈ వార్త కాంగ్రెస్ పార్టీని అతలాకుతలం చేసింది.
అయితే.. దీనిపై ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్వయంగా వచ్చి ఏ ప్రకటనా చేయలేదు. ఆ పార్టీతో తనకు సంబంధం లేదని చెప్పలేదు. కేవలం తన వర్గం వాళ్లతో పోలీసులకు ఫిర్యాదు చేయిస్తున్నారు.
"మల్లోసారి మాట్లాడితే బద్దలు, వీపు పల్గుతదని చెప్పు"
ఇదీ మన పీసీసీ చీఫ్ @revanth_anumula గారు మాట్లాడే పద్ధతిఇలా బెదిరించి జర్నలిస్టులను భయపెడదామనుకుంటున్నారా ?
రేపు మాట్లాడుకుందాం పూర్తి వివరాలు
Do you want to threaten journalists like this?@INCIndia pic.twitter.com/oTaTi7mIiy
— Journalist Shankar (@shankar_journo) December 26, 2022
మరోవైపు.. కాంగ్రెస్ లో ముందునుంచీ ఉన్న నేతలు మాత్రం.. రేవంత్ పార్టీ సంగతి ఏంటో తేల్చాలని అడుగుతున్నారు. అదిష్టానానికి లేఖలు రాస్తున్నారు. ట్వీట్ చేసిన జర్నలిస్టుకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు.
కానీ ఇక్కడే అసలు లాజిక్ ఉంది.
వాస్తవానికి ఓ జర్నలిస్టు తనకు ఉన్న సమాచారంతో ఓ ట్వీట్ చేశారు. అది తప్పు అయినప్పుడు రేవంత్ రెడ్డి స్వయంగా ట్వీట్ చేసి.. ఆ జర్నలిస్టు రాసింది తప్పు అని చెప్పాల్సింది. అంతటితో ఆ ఇష్యూ ముగిసిపోయేది.
కానీ అలా చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా తన వర్గం లీడర్లతో పోలీసు కంప్లైంట్లు ఇప్పించారు.
అంటే.. ఈ ఇష్యూ రాద్దాంతం కావాలి. రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగాలనేది రేవంత్(Revanth Reddy) ప్లాన్ గా తెలుస్తోంది. అందుకే తాను మాట్లాడకుండా తన వర్గంతో హడావుడి చేయిస్తున్నారనే టాక్ ఉంది.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయింది. పాత నేతలు, వలస నేతలుగా విడిపోయి వాదులాటకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో కావాలనే రేవంత్ రెడ్డి కొత్త పార్టీ డ్రామా మొదలుపెట్టారని ఆ పార్టీ సీనియర్లు అంటున్నారు.
పార్టీ పేరుతో హడావుడి చేస్తే.. తనతో ఎంత మంది ఉంటారు.? పాత కాంగ్రెస్ తో ఎంతమంది ఉంటారనేది తేలిపోతుంది. తన వెంట వచ్చేవాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంటే.. పాత జెండా పక్కనపెట్టి.. కొత్త జెండా.. ఎజెండాతో జనంలోకి వెళ్లాలనేది రేవంత్ రెడ్డి ప్లాన్ అని గాంధీభవన్ లో చర్చ జరుగుతోంది.
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చాక.. పార్టీకి ఓ బలమైన వాయిస్ దొరికిందని కేడర భావించింది. ఆయన వెంట నడవటం ప్రారంభించింది. ఇప్పుడు అదే రేవంత్ కు బలంగా మారిందంటున్నారు. తాను కొత్త పార్టీ పెడితే ముందు నుంచీ కాంగ్రెస్ జెండా మోస్తున్న వాళ్లు కూడా తన వెంట వస్తారనే ధీమా రేవంత్ లో కనిపిస్తోందని సన్నిహిత వర్గాలు చెబుతున్న మాట.
ఓవరాల్ గా ఇప్పటికే తెలంగాణలో సగం చచ్చిన కాంగ్రెస్ ను పూర్తిగా చంపేసి.. తన బలాన్ని, బలగాన్ని పెంచుకునే ప్రణాళికలు తెరవెనక జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.
Read Also :