Revanth vs ShashiTharoor : రాజకీయాలు చాలా కామెడీగా ఉంటాయి. కాంగ్రెస్ పార్టీలో అయితే అది మరింత విచిత్రంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ అనేది అందరికి తెలిసిన విషయమే.
కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్య స్వేచ్ఛ ఈ స్థాయిలో ఉంటుందా అని.. ఆశ్చర్యపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మన తెలంగాణ కాంగ్రెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇప్పడది మరింత పీక్స్ కు వెళ్లింది. ఏకంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy).. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత శశిథరూర్ ను గాడిద అనేశారు. ఎవరితోనో చిట్ చాట్ లో ఈ కామెంట్స్ చేశారు రేవంత్. అది ఎవరో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వదిలారు.
మామూలుగా అయితే.. కాంగ్రెస్ పార్టీ వాళ్లే దీన్ని ఖండించాలి. కానీ ఏకంగా మంత్రి కేటీఆర్ దీనిపై స్పందించారు. శశిథరూర్ ను గాడిద అనడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఓ ట్వీట్ చేశారు. ధర్డ్ గ్రేడ్ క్రిమినల్స్ పార్టీని లీడ్ చేస్తూ ఉంటే ఇలాంటి మాటలే మాట్లాడతారంటూ రేవంత్(Revanth Reddy) కు చురకలంటించారు.
ఈ ట్వీటు.. ఆ ట్వీటూ.. ఇష్యూ కాస్త సోషల్ మీడియాలో పెద్ద రచ్చే అయ్యింది. మన తెలుగు మీడియా పెద్దగా పట్టించుకోక పోయినా..కొన్ని నేషనల్ న్యూస్ పేపర్స్ ఈ ఇష్యూని కవర్ చేశాయి.
తిట్టిన రేవంత్ సైలెంట్ గానే ఉన్నాడు.. తిట్టించుకున్న శశిథరూర్ సైలెంట్ గానే ఉన్నాడు. కానీ సోషల్ మీడియాలో మాత్రం గబ్బు లేసింది.
వెంటనే ఆయింట్ మెంట్ పూసే పని ప్రారంభించారు కాంగ్రెస్ పెద్దలు. రేవంత్ తో మాట్లాడి… శశిథరూర్ కు స్వారీ చెప్పించారు. మనం మనం బరంపురం.. ఇద్దరు ట్విట్టర్ తో రీ ట్వీట్ లు చేసుకున్నారు. క్షమాపణ కోరుతున్నానని రేవంత్.. దాన్ని స్వీకరించానని శశిథరూర్ ట్వీట్ పెట్టి… ఈ కథకు పుల్ స్టాప్ పెట్టారు.
ఎంత పుల్ స్టాప్ పెట్టినా.. గాడిద అనే మరక మాత్రం సోషల్ మీడియా నుంచి పోదుకదా..!